కింగ్ లైక్స్ లోకేష్ వెరీ మచ్.. రీజన్ ఏంటంటే..?
అలానే సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా తెలుగు ప్రెస్ మీట్ లో లోకేష్ నిర్మాతకు 5 కోట్లు మిగిల్చిన విషయాన్ని చెప్పి సర్ ప్రైజ్ చేశారు.
By: Ramesh Boddu | 5 Aug 2025 9:10 AM ISTమన కింగ్ నాగార్జున ఒక స్టార్ హీరో మాత్రమే కాదు స్టార్ ప్రొడ్యూసర్ కూడా. నాగార్జున సినిమాలు నటించడమే కాదు నిర్మిస్తూ వస్తున్నారు. అన్నపూర్ణ బ్యానర్ లో సినిమా వస్తే అది మాక్సిమం ప్రేక్షకుల మనసులు గెలిచేస్తుంది. అందుకే హీరో గానే కాదు నాగార్జున అప్పుడప్పుడు నిర్మాత యాంగిల్ నుంచి కూడా మాట్లాడతాడు. అలానే సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా తెలుగు ప్రెస్ మీట్ లో లోకేష్ నిర్మాతకు 5 కోట్లు మిగిల్చిన విషయాన్ని చెప్పి సర్ ప్రైజ్ చేశారు.
నిర్మాతకు 5 కోట్లు మిగిల్చిన లోకేష్..
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కూలీ సినిమా లాస్ట్ షెడ్యూల్ బ్యాంకాక్ లో ముగించాడు. చివరి రోజు నాగార్జున దగ్గరకు వచ్చి షూటింగ్ పూర్తైందని చెప్పి నిర్మాతకు 5 కోట్లు మిగిల్చానని చెప్పాడట. సన్ పిక్చర్స్ సినిమాకు మరో 15 కోట్లు కావాలన్నా ఇస్తారు. కానీ లోకేష్ నిర్మాతకు ఖర్చు తగ్గించాలని ఇచ్చిన బడ్జెట్ కన్నా 5 కోట్లు సేఫ్ చేసి మరీ మూవీ పూర్తి చేశాడు. ఈ క్వాలిటీ లోకేష్ లో నాగార్జునకు బాగా నచ్చింది.
ఇక లోకేష్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. అతను చేసిన ఖైదీ, విక్రం సినిమాలు తనకు చాలా ఇష్టమని అన్నారు నాగార్జున. తను వచ్చి కథ చెప్పగానే రజినీ ఈ సినిమా చేస్తానని అన్నారా అని అడిగాను. అంతేకాదు కెరీర్ లో ఫస్ట్ టైం సినిమా స్టోరీని రికార్డ్ చేసుకున్నా అని అన్నారు నాగార్జున.
కెరీర్ లో ఎప్పుడూ కొత్తగా చేయడం తనకు అలవాటే అని.. నిన్నే పెళ్లాడతా తర్వాత అన్నమయ్య చేస్తున్న టైం లో తనని చాలామంది డిస్ కరేజ్ చేసినా ఆ సినిమా చేశానని అన్నారు నాగార్జున. ఈమధ్యనే నాగార్జున కుబేర సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేసి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు నాగార్జున. కూలీ సినిమాలో సైమన్ పాత్రలో బ్యాడ్ గాయ్ గా కనిపించనున్నారు నాగార్జున.
రజినీకాంత్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ లో కూలీ..
సినిమా రెండో రోజు షూటింగ్ లోనే తనని చూసి నువ్వు ఇలా ఉంటావని తెలిస్తే ఒప్పుకునే వాడిని కాదని అన్నారు రజినీకాంత్. ఈవెంట్ లో రజినీ పాల్గొనలేదు కానీ ఒక వీడియో మెసేజ్ పంపించారు. తన 50 ఏళ్ల సినీ కెరీర్.. గోల్డెన్ జూబిలీ ఇయర్ లో కూలీ సినిమా వస్తుంది. ఈ సినిమాను ఆదరించాలని తెలుగు ఆడియన్స్ ను కోరారు రజినీకాంత్.
లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన కూలీ సినిమాలో నాగార్జునతో పాటు కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూడా నటించారు. ఇంతమంది స్టార్స్ తో ఇంత పెద్ద సినిమా తీసి ఇంకా నిర్మాతకు 5 కోట్లు మిగిల్చేలా చేయడం అంటే నిజంగానే లోకేష్ సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. సినిమాకు అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చింది. ఆగష్టు 14న రజినీకాంత్ కూలీ రిలీజ్ అవుతుంది. ఐతే ఈ సినిమాకు పోటీగా అదే రోజు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 కూడా రిలీజ్ అవుతుంది.
