Begin typing your search above and press return to search.

మా నమ్మకం.. మా గర్వం అంటూ 'లెనిన్' పై పీక్స్ లో!

అక్కినేని అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ వ‌చ్చేసింది. అఖిల్ అక్కినేని హీరోగా న‌టిస్తోన్న‌ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ `లెనిన్` చిత్రానికి సంబంధించి ఓక్రేజీ అప్‌డేట్ వెలువడింది.

By:  Srikanth Kontham   |   29 April 2026 11:01 AM IST
మా నమ్మకం.. మా గర్వం అంటూ లెనిన్ పై పీక్స్ లో!
X

అక్కినేని అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ వ‌చ్చేసింది. అఖిల్ అక్కినేని హీరోగా న‌టిస్తోన్న‌ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ `లెనిన్` చిత్రానికి సంబంధించి ఓక్రేజీ అప్‌డేట్ వెలువడింది. ఈ సినిమా ఫస్ట్ కట్ కింగ్ నాగార్జున‌ నిన్న రాత్రి వీక్షించి సోషల్ మీడియా వేదికగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. `లెనిన్ సినిమా ఫస్ట్ కట్ చూశాం. జూన్ 26 2026న మీరు సరికొత్త అఖిల్‌ను వెండి తెరపై చూడబోతున్నారు. ఇది మా నమ్మకం, మా గర్వం అంటూ నాగ్ అంచ‌నాలు తారా స్థాయికి తీసుకెళ్లారు. ఈ ట్వీట్ అక్కినేని అభిమానుల్లో వైర‌ల్ గా మారింది.

అఖిల్ కి స‌రైన హిట్ ప‌డాల‌ని అక్కినేని ఫ్యామిలీ స‌హా అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న స‌మ‌యంలో నాగ్ ట్వీట్ న‌మ్మ‌కాన్ని రెట్టింపు చేసింది. ఈ సినిమాపై ఇప్ప‌టికే మేక‌ర్స్ ధీమ‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటి వరకు మనం చూసిన అఖిల్‌కు ఈ సినిమాలో చూడబోయే అఖిల్‌కు నటనలోనూ, ఆహార్యంలోనూ ఎంతో వ్యత్యాసం ఉండబోతోందని మేక‌ర్స్ గ‌తంలో నే తెలిపారు. `లెనిన్` సినిమా కోసం అఖిల్ గత ఏడాది కాలంగా శ్రమిస్తున్నారు. తన బాడీ లాంగ్వేజ్ నుండి డైలాగ్ డెలివరీ వరకు ప్రతి విషయంలోనూ చాలా మార్పులు చేసాడు.

వెండి తెర‌పై స‌రికొత్త అఖిల్ నే ద‌ర్శ‌కుడు ముర‌ళీ కిషోర్ అబ్బూరి ఆవిష్క‌రించ‌డాని ప్ర‌చార చిత్రాల‌తోనే క్లారిటీ వ‌చ్చేసింది. తాజాగా నాగ్ వ్యాఖ్య‌ల‌తో మ‌రో స్ట‌ష్ట‌మైంది. రిలీజ్ త‌ర్వాత అదే మాట నిజం కాబోతుంద‌ని అక్కినేని అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాతో అఖిల్ మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గరవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించుకుంటాడంటున్నారు. మొత్తంగా అఖిల్ అక్కినేని కెరీర్‌లో `లెనిన్` గేమ్ ఛేంజర్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

చిత్ర యూనిట్ చూపిస్తున్న ఈ స్థాయి ఆత్మవిశ్వాసం సాధారణంగా ఒక పెద్ద హిట్ సినిమా విషయంలోనే కనిపిస్తుంది. జూన్ 26న థియేటర్లలో కలిద్దాం అంటూ మేకర్స్ ఇచ్చిన పిలుపుతో ప్రచార పర్వం కొత్త వేగం పుంజుకుంది. అక్కినేని వారసుడి ఈ సరికొత్త ప్రయాణం ఏ స్థాయి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా విష‌యంలో అఖిల్ ఇంకా ఎలాంటి కామెంట్ చేయ‌లేదు. గ‌త సినిమాల విష‌యంలో ముందే మాట్లాడిన అఖిల్ `లెన‌న్` విష‌యంలో మాత్రం నిశ్వ‌బ్ద‌మే అతి పెద్ద శ‌బ్దంగా మారుతుంది ? అనే న‌మ్మ‌కంతో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.