మొత్తానికి నాగార్జున ఇంప్రెస్ అయ్యాడా..?
ఐతే ఆ సినిమా తర్వాత సోలో సినిమా కథ మాత్రం దొరకట్లేదు. నా సామిరంగ తర్వాత ధనుష్ తో కుబేర, రజినీతో కూలీ సినిమాలు చేస్తున్నాడు నాగార్జున.
By: Tupaki Desk | 12 Jun 2025 5:00 AM ISTకింగ్ నాగార్జున నా సామి రంగ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. సంక్రాంతికి మాస్ సినిమాతో వచ్చి హిట్టు కొట్టే హీరోలు ఉన్నారు. ఐతే నాగార్జున మాత్రం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వచ్చి సూపర్ హిట్ కొడుతుంటాడు. అంతకుముందు సోగ్గాడే చిన్ని నాయనా ఆ తర్వాత బంగార్రాజు లాస్ట్ ఇయర్ నా సామి రంగ తో హిట్టు కొట్టాడు. పొంగల్ కి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తే ఆ సినిమా పక్కా హిట్టే అని మరోసారి ప్రూవ్ చేశాడు నాగార్జున.
ఐతే ఆ సినిమా తర్వాత సోలో సినిమా కథ మాత్రం దొరకట్లేదు. నా సామిరంగ తర్వాత ధనుష్ తో కుబేర, రజినీతో కూలీ సినిమాలు చేస్తున్నాడు నాగార్జున. కుబేర తెలుగు సినిమాలానే అనిపిస్తుంది. ఐతే ధనుష్ హీరో కాబట్టి తమిళ్ లో కూడా భారీ రిలీజ్ అవనుంది. కుబేర, కూలీ రెండు సినిమాల్లో నాగార్జున నటించడానికి గల కారణం ఏంటన్నది సినిమా చూస్తేనే తెలుస్తుందని అంటున్నారు. హీరోగానే కాదు తనకు నచ్చిన ఎలాంటి పాత్ర అయినా చేస్తానని ఇదివరకే చాలాసార్లు ప్రూవ్ చేశాడు మన కింగ్.
కుబేర, కూలీ ఈ రెండిటితో మరోసారి అది ప్రూవ్ చేయనున్నారు. ఐతే నా సామిరంగ తర్వాత సోలో సినిమా కోసం కథలు వింటూ వస్తున్న నాగార్జునకు ఫైనల్ గా ఒక స్టోరీ బాగా నచ్చేసిందని టాక్. నూతన దర్శకుడు చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యాడట. కథ నచ్చింది కథనం కూడా ఓకే కొన్ని మార్పులు చేస్తే సూపర్ అని చెప్పాడట నాగార్జున. త్వరలోనే ఫైనల్ సిట్టింగ్ అవుతుందని అది అవ్వగానే సినిమా అనౌన్స్ మెంట్ అని అంటున్నారు.
నాగార్జున ఎప్పుడు కొత్తదనానికి ప్రాధాన్యత ఇస్తాడు. సీనియర్ హీరోల్లో అందరు దాదాపు హిట్ ఫాం కొనసాగిస్తుంటే నాగార్జున మాత్రం సినిమాకు కథలు దొరక్క వెనకపడ్డాడు. ఐతే కొత్త కథ లాక్ అయింది కాబట్టి త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉండబోతుందని తెలుస్తుంది. ఇంతకీ నాగార్జున నెక్స్ట్ సినిమా ఏంటి ఎలాంటి కథతో వస్తాడని అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా ఆసక్తికరంగా ఉన్నారు. నాగార్జున కొత్త సినిమా కుదిరితే దసరాకి ముహూర్తం పెట్టే అవకాశాలు ఉన్నట్టు టాక్. మొన్నటిదాకా అఖిల్ పెళ్లిసందడిలో బిజీగా ఉన్న నాగ్ ఇక సోలో సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.
