కింగ్ నాగార్జున ఇదే ఫార్ములాను కంటిన్యూ చేస్తాడా?
తన కొత్త ఫార్ములా ప్రకారమే ధనుష్ నటించిన 'కుబేర', సూపర్ స్టార్ రజనీకాంత్ తో లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న 'కూలీ' సినిమాల్లో విలన్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారని తెలుస్తోంది.
By: Tupaki Desk | 18 Jun 2025 5:00 PM ISTటాలీవుడ్‌లో ఉన్న టాప్ సీరియర్ హీరోల్లో కింగ్ నాగార్జున ఒకరన్నది తెలిసిందే. అయితే చిరుతో పాటు బాలయ్య, విక్టరీ వెంకటేష్ హీరోలుగా సోలో హిట్‌లు సాధిస్తూ ఎంజాయ్ చేస్తుంటే కింగ్ నాగార్జున మాత్రం గత కొంత కాలంగా సరైన సక్సెస్‌ని దక్కించుకోలేక సతమతమవుతున్నారు. కెరీర్ పరంగా చాలా ఇబ్బందికరమైన ఫేజ్‌ని ఎదుర్కొంటున్నారు. గత ఏడాది మలయాళ రీమేక్ ఆధారంగా నాగ్ చేసిన మూవీ 'నా సామి రంగ'.
2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా నాగ్‌కు ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. కానీ ఈ ఏడాది సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో వచ్చిన వెంకీ మామ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని వసూళ్ల పరంగానూ రికార్డులు సృష్టించాడు. నాగ్ మాత్రం ఆ రేంజ్ హిట్‌ని సొంతం చేసుకోలేక బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాడు.
ఈ నేపథ్యంలోనే కింగ్ నాగార్జున కొత్త ఫార్ములాని ఫాలో కావాలని, హీరోగా, నటుడిగా కొనసాగాలంటే, అందరిలో ఉన్న క్రేజ్‌ని అలాగే మెయింటైన్ చేయాలంటే కొత్త పంథాని అనుసరించక తప్పదనే నిర్ణయానికి వచ్చారట. ఇందులో భాగంగానే కథకు కీలకంగా నిలిచే పవర్ ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లకు ఓకే చెప్పాలనుకున్నారట. దాని ప్రకారమే హీరో రోల్స్ అప్పుడప్పుడు చేస్తూ పవర్ ఫుల్ క్యారెక్టర్లకు ప్రాధాన్యత నివ్వాలని డిసైడ్ అయ్యారట.
తన కొత్త ఫార్ములా ప్రకారమే ధనుష్ నటించిన 'కుబేర', సూపర్ స్టార్ రజనీకాంత్ తో లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న 'కూలీ' సినిమాల్లో విలన్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారని తెలుస్తోంది. రజనీ 'కూలీ'లో నాగ్ పవర్ ఫుల్ విలన్‌గా సిమోన్ అనే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని, రజనీతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ఆ కారణంగానే నాగ్ ఈ క్యారెక్టర్ చేశాడట. ఇప్పటికే బాలీవుడ్ మూవీ 'బ్రహ్మాస్త్ర'లో పవర్ ఫుల్‌గా సాగే నంది అస్త్ర క్యారెక్టర్‌లో నటించిన నాగ్ ఇకపై ఇదే ఫార్ములాని కొనసాగిస్తూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందే సినిమాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్లు చేస్తారట. అయితే ఇక డైరెక్టర్లు చాలా వరకు నాగ్ కోసం కొత్త తరహా క్యారెక్టర్లని సృష్టించడం ఖాయం.
