అక్కినేని వారసులు బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా?
కోలీవుడ్ యువ సంచలనం నవీన్ అనే కుర్రాడితో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
By: Tupaki Desk | 3 April 2025 11:00 AM ISTకింగ్ నాగార్జున -యువ సామ్రాట్ నాగచైతన్య ల్యాండ్ మార్క్ చిత్రాలు ఒకేసారి ప్లాన్ చేస్తున్నారా? తండ్రి-తనయులిద్దరు ఒకే ఏడాది రప్ఫాడించాలనుకుంటున్నారా? అంటే అవుననే లీకులందుతున్నాయి. నాగార్జున సెంచరీకి సమీపంలో ఉన్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం పీక్స్ లో జరుగుతోంది. ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నాగ్ ప్లాన్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ కోడై కూస్తుంది.
కోలీవుడ్ యువ సంచలనం నవీన్ అనే కుర్రాడితో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే రేసులో విక్రమ్. కె. కుమార్ పేరు కూడా జోరుగా వినిపిస్తుంది. నాగ్ `మనం` లాంటి క్లాసిక్ చిత్రాన్ని చేయాలనే ఆలోచనలో ఉన్నారన్నది మరో వెర్షన్. అఖిల్.. చైతన్య.. సుమంత్ లను ఈ ప్రాజెక్ట్ లో భాగం చేసి అక్కినేని అభిమానులకు మరో క్లాసిక్ అందించాలనే ఆలోచన స్ట్రాంగ్ ఉన్నట్లు వినిపిస్తుంది.
మరి వీరిద్దరిలో నాగ్ ఆప్షన్ ఎవరు? అన్నది త్వరలో క్లారిటీ వస్తోంది. అటు నాగచైతన్య కూడా 25వ చిత్రానికి సంబంధించి అప్పుడే పనులు మొదలు పెట్టాడు. 24వ చిత్రం ఆన్ సెట్స్ లో ఉండగానే 25పై కసరత్తులు మొదలు పెట్టాడు. ఈనేపథ్యంలోనే కిషోర్ అనే కొత్త కుర్రాడి పేరు తెరపైకి వస్తోంది. ఇప్పటికే కిషోర్ ఓ డిఫరెంట్ యాక్షన్ జోనర్ స్టోరీ వినిపించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ పైనా అధికారిక సమాచా రం వెలువడాల్సి ఉంది.
ఈ రెండు ప్రాజెక్ట్ లు కన్పమ్ అయితే ఇద్దరు కొత్త కుర్రాళ్లకు తండ్రి-తనయులు అవకాశం ఇచ్చినట్లే. నవీన్ కోలీవుడ్ లో ట్యాలెంటెడ్ రైటర్ గా సౌండింగ్ గట్టిగానే వినిపిస్తుంది. కిషోర్ కూడా టాప్ రైటర్స్ కం డైరెక్టర్స్ దగ్గర పనిచేసిన అనుభవజ్ఞుడిగా వినిపిస్తుంది. ఈ రెండు చిత్రాలు కూడా ఒకేసారి పట్టాలెక్కించి రిలీజ్ చేయగల్గితే అభిమానులకు అదో సర్ ప్రైజ్. మరేం జరుగుతుందన్నది చూడాలి.
