అక్కినేని అభిమానుల కోసం సిసిలైన మాస్!
కింగ్ నాగార్జునకు సరైన మాస్ యాక్షన్ చిత్రం పడి చాలా కాలమవుతోంది. ఆయనలో సిసిలైన మాస్ కోణాన్ని చూసి కొన్ని సంవత్సరాలవుతుంది.
By: Tupaki Desk | 8 May 2025 11:34 AM ISTకింగ్ నాగార్జునకు సరైన మాస్ యాక్షన్ చిత్రం పడి చాలా కాలమవుతోంది. ఆయనలో సిసిలైన మాస్ కోణాన్ని చూసి కొన్ని సంవత్సరాలవుతుంది. ఆయన ఇమేజ్ కి కథలు పడకపోవడం ఓ కారణమైతే? రొమాంటిక్ కామెడీ జానర్లకు పరిమితమవ్వడంతో? కింగ్ మాస్ ఇమేజ్ కి దూరమవుతున్నారా? అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్లు వందల కోట్ల వసూళ్లు రాబడుతుంటే నాగ్ మాత్రం ఇంకా ఆ ఫిగర్ కి అతి చేరువలో కూడా రాలేకపోతున్నారు.
ఇవన్నీ అక్కినేని అభిమానుల్లో తీవ్ర నిరుత్సాహనికి దారి తీస్తున్నాయి. అయితే ఇప్పుడా లెక్కలు కాస్త అయినా సరిచేయడానికి కూలీ రూపంలో రావడం సంతోషకరంగా ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో నాగ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఈ పాత్ర ఎలా ఉంటుంది? కింగ్ లుక్ ఉంటుంది? అన్న దానిపై బజ్ నెలకొంది.
ఈ నేపథ్యంలో తాజాగా `కూలీ` నుంచి కింగ్ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ఒకటి వైరల్ గా మారింది. ఇందులో నాగ్ ఫేస్ రివీల్ చేయలేదు. కానీ బ్యాక్ ఫోజు నుంచి అది కింగ్ అని అభిమానులు కన్పమ్ చేసుకున్నారు. స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు. మునుపటి మాస్ ని మళ్లీ పరిచయం చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఒకప్పటి నాగ్ ని మళ్లీ ఇందులో కనిపిస్తున్నాడు. బ్యాక్ ఫోజులోనే ఈ రేంజ్ లో డిజైన్ చేసారంటే? ప్రంట్ లుక్ పీక్స్ లో ఉంటుందంటూ అభిమానులు ఉత్సాహం ఉరకలేస్తుంది.
లోకేష్ గత సక్సస్ లు చూసి కింగ్ పాత్ర పవర్ పుల్ గా ఉంటుందంటూ కాన్పిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా తర్వాత నాగ్ మళ్లీ మాస్ అప్పిరియన్స్ ని పీక్స్ కి తీసుకెళ్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు సబంధించి ఇంకా టీజర్, ట్రైలర్ లు రిలీజ్ కావాల్సి ఉంది. వాటితో మరింత క్లారిటీ వస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది.
