Begin typing your search above and press return to search.

'కుబేర' హీరోలు మేం కాదు: నాగార్జున

అయితే రీసెంట్ గా మేకర్స్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా.. కుబేర క్రూ అండ్ క్యాస్ట్ అంతా హాజరయ్యారు.

By:  Tupaki Desk   |   16 Jun 2025 4:36 AM
కుబేర హీరోలు మేం కాదు: నాగార్జున
X

టాలీవుడ్ కింగ్ నాగార్జున వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఓవైపు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి కూలీ మూవీ చేస్తున్న ఆయన.. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో నటించారు. గవర్నమెంట్ ఆఫీసర్ గా, ధనవంతుడిగా సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

అయితే రీసెంట్ గా మేకర్స్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా.. కుబేర క్రూ అండ్ క్యాస్ట్ అంతా హాజరయ్యారు. నాగార్జున కూడా అటెండ్ అయ్యారు. ఎప్పటిలానే ఎవర్ గ్రీన్ లుక్ లో ఈవెంట్ లో సందడి చేశారు. అందుకు సంబంధించిన పిక్స్ అండ్ వీడియోస్.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఫ్యాన్స్ అందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్పారు నాగార్జున. ఆ తర్వాత ధనుష్‌తో కలిసి నటించినందుకు హ్యాపీగా ఉందని, ఒక గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు, క్యారెక్టర్ లో ధనుష్ పెర్ఫార్మ్ చేసే విధానం అవుట్ స్టాండింగ్ అంటూ కొనియాడారు.

కుబేర సినిమా గురించి మాట్లాడాలంటే తనకు శేఖర్ కమ్ముల గుర్తుకొస్తారని తెలిపారు. ఇది కేవలం ఆయన చిత్రమేనని అన్నారు. తామంతా ఇందులో పాత్రలు మాత్రమేనని పేర్కొన్నారు. ఆయన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తీసిన సినిమా అని తెలిపారు. తమను కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చారని చెప్పారు.

మాయాబజార్ చూసినప్పుడు అది కెేవీ రెడ్డి ఫిల్మ్ అంటారు కదా.. అలాగే కుబేర కూడా శేఖర్ కమ్ముల ఫిల్మ్ అని చెప్పారు. ఆయన కోసమే తాను ఈ సినిమా చేశానని చెప్పారు. మూవీ హిట్ అవుతుందని శేఖర్ కాన్ఫిడెంట్ గా చెప్తుంటే చాలా ధైర్యంగా అనిపిస్తుందని తెలిపారు. శేఖర్ పై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.

దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడని, పాటలు వింటుంటే పూనకం వస్తుందని అన్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశారని కొనియాడారు. చాలా రోజులకు టీమ్ వర్క్ కనిపించిందని, నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని, ఎన్ని సంవత్సరాలైనా అభిమానుల ప్రేమ చెక్కుచెదరకుండా ఉందని చెప్పారు. ఎలాంటి పాత్రలు చేసినా అంతా ఒప్పుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.