కూలీ ముందా? కుబేర ముందా?
దీనిపై నాగార్జున క్లారిటీ ఇచ్చారు. నా సామారంగ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే శేఖర్ కమ్ములా 'కుబేర' కథతో అప్రోచ్ అయినట్లు తెలిపారు.
By: Tupaki Desk | 20 Jun 2025 11:39 AM ISTకింగ్ నాగార్జునకు మల్టీస్టారర్ చిత్రాలకు చేయడం కొత్తేం కాదు. తన జనరేషన్ హీరోల్లో మల్టీస్టారర్ చిత్రా ల్లో తొలిసారి నటించింది నాగార్జున. తన సీనియర్లను ఆదర్శంగా తీసుకుని స్టార్స్ అందరితో కలిసి పని చేయాలి? అన్న నాగ్ కోరిక మేరకు ఎన్నో సినిమాలు చేసారు. ఇంకా చెప్పాలంటే? ఆయా చిత్రాల్లో నాగా ర్జున అగ్ర హీరో. కానీ నాగ్ ఎప్పుడు తన కోస్టార్స్ ని తక్కువ చేసింది లేదు. తన సమానంగానే ట్రీట్ చేసి ఇండ స్ట్రీలో గొప్ప నటుడిగా ఖ్యాతికెక్కారు.
అటుపై కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా పోషించారు. ఇటీవలే ప్రధాన పాత్రలవైపు కూడా టర్న్ అయ్యారు. 'కూలీ', 'కుబేర' చిత్రాల్లో నాగ్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. రెండు పాన్ ఇండియా చిత్రాలు. భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్నాయి. అయితే కీలక పాత్రలకు టర్న్ అవ్వడం అన్నది ఇదే తొలిసారి కావడంతో మొదటగా ఏ సినిమా దర్శకుడు అప్రోచ్ అయ్యారు? అన్న అంశం తెరపైకి వచ్చింది.
దీనిపై నాగార్జున క్లారిటీ ఇచ్చారు. నా సామారంగ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే శేఖర్ కమ్ములా 'కుబేర' కథతో అప్రోచ్ అయినట్లు తెలిపారు. ఆ తర్వాతే 'కూలీ'తో లోకేష్ వచ్చినట్లు తెలిపారు. రెండు కథల్లో పాత్రలు తనకు బాగా నచ్చడంతో? ఇంకే విషయం ఆలోచించకుండా ఒప్పుకున్నట్లు తెలిపారు. 'ఇండస్ట్రీ మారింది. సినిమాలు తీసే విధానం మారింది. పాన్ ఇండియా అంటూ ఎక్కడికో వెళ్లిపోయాం.
స్టార్స్ కలిస్తే మంచి కథలు వస్తాయి. కుబేర లో నటిస్తున్నప్పుడు రష్మికకు ఇందులో నువ్వే స్టార్ అని చెప్పా.ఆమె పాత్ర అంత గొప్పగా ఉంటుంది. ధనుష్ పూర్తిగా పాత్రలోకి వెళ్లి నటించాడు. కుబేర విష యంలో కథే అతి పెద్ద స్టార్. కూలీ బిన్నమైన సినిమా. లోకేష్ మార్క్ ఎంటర్ టైనర్ అది. అందులో సరికొత్త పాత్రలో నన్ను చూస్తార'న్నారు.