నాగార్జున తొలి సెంచరీ..కానీ అసలు సెంచరీ అప్పుడే!
కింగ్ నాగార్జున 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారా? అంటే అవుననే తెలుస్తోంది. అవును ఇటీవల రిలీజ్ అయిన 'కుబేర' చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 July 2025 3:00 AM ISTకింగ్ నాగార్జున 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారా? అంటే అవుననే తెలుస్తోంది. అవును ఇటీవల రిలీజ్ అయిన 'కుబేర' చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో నాగార్జున ఖాతాలో తొలి సెంచరీ నమో దైంది. అయితే ఈ క్రెడిట్ నాగార్జున ఒక్కరికే సొంతం కాదు. అందులో కోలీవుడ్ స్టార్ ధనుష్ కూడా భాగమే. ఇద్దరు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. కానీ కింగ్ ఖాతాలో ఇంతవరకూ సెంచరీ లేక పోవ డంతో ఇదే తొలి సెంచరీగా చెప్పాల్సిన పరిస్థితి. దీంతో నాగార్జున 100 కోట్ల స్టార్ గా పెద్దగా ఫోకస్ అవ్వడం లేదు.
ఇందులో హీరో ధనుష్ కాగా నాగార్జున కీలక పాత్ర పోషించారు. అలాగని నాగ్ పాత్ర చిన్నది కాదు. దాదాపు సినిమా అంతా ఆరోల్ ఉంటుంది. క్లైమాక్స్ లోనే ముగిసిపోతుంది. అయితే ఆపాత్రలో కాస్త నెగిటివ్ కోణం ఉంటుంది. పూర్తిగా హీరోయిక్ పాత్రగా నాగ్ పాత్రను చెప్పలేం. ఈ నేపథ్యంలో ఇదో అసంతృప్తి. కానీ నాగ్ సోలోగా సెంచరీ కొట్టడం అన్నది తన 100వ చిత్రంతోనే ప్లాన్ చేసాడు.
తమిళ దర్శకుడు కార్తీక్ తో తన వందవ చిత్రాన్ని లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టోరీ లాక్ అయింది. త్వరలోనే ప్రారంభమవుతుంది. ఎంతో మంది దర్శకుల తర్వాత కార్తిక్ ఫైనల్ అయ్యాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై నాగ్ ఎంత నమ్మకంగా ఉన్నారు? అన్నది అద్దం పడుతుంది. ఈసినిమాతో నాగార్జున సోలోగా 100 కోట్ల క్లబ్లో చేరతాడని అంచనాలు బలంగా ఉన్నాయి.
సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. వారంతా సోలో గానే బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లను సాధించిన స్టార్లు. కింగ్ కూడా వాళ్ల సరసన చేరాలంటే 100 కోట్ల తప్పనిసరి.
