నాగార్జున@100.. మళ్లీ సేమ్ ఫార్ములా!
కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వం వహిస్తారని.. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 13 Jun 2025 2:30 AMటాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పుడు కుబేర, కూలీ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ రెండు చిత్రాల్లో కూడా ఆయన సపోర్టింగ్ అండ్ స్పెషల్ రోల్స్ పోషిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేరలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. నాగార్జున మిలియనీర్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
జూన్ 20వ తేదీన ఆ సినిమా రిలీజ్ కానుండగా.. ఇప్పుడు నాగ్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. సేమ్ రోల్స్ చేసి బోర్ కొట్టిందని.. అప్పుడే కుబేర ఆఫర్ తన వద్దకు వచ్చిందని రీసెంట్ గా తెలిపారు. మరోవైపు, కూలీ మూవీని లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తుండగా.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్నారు.
ఆ సినిమాలో నాగ్ రోల్.. పవర్ ఫుల్ గా ఉండనుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గా మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 14న రిలీజ్ కానుందీ చిత్రం. ఇదిలా ఉండగా.. నాగార్జున తన 100వ చిత్రాన్ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వం వహిస్తారని.. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తోంది. నాగ్ మూవీతోనే ఆయన టాలీవుడ్ కు రానున్నారట. కింగ్ 100 అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని.. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుందని తెలుస్తోంది. జూలైలో ఆ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వనుందని సమాచారం.
ఆగస్టు 29వ తేదీన నాగ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కానుందని వినికిడి. అయితే నితం ఒరు వానం మూవీతో కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ కార్తీక్. అయితే ఇప్పుడు నాగ్ 100వ చిత్రానికి మాస్ డైరెక్టర్ ను సెలెక్ట్ చేసుకుంటారని అంతా అనుకున్నామని నెటిజన్లు , అభిమానులు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు.
కానీ కొత్త కథలు, కొత్త దర్శకులతో ఎల్లప్పుడూ రిస్క్‌లు తీసుకున్నట్లే.. ఈ సారి కూడా నాగ్ అలాగే చేశారని చెబుతున్నారు. కథ క్లిక్ అయితే మాత్రం తెలివైన చర్య కావచ్చని అంటున్నారు. ఎప్పుడూ తన సైలెక్షన్ తో షాక్ ఇచ్చే నాగార్జున.. మరోసారి తన ల్యాండ్ మార్క్ మూవీలో అదే ఫార్ములా ఫాలో అయ్యారని కామెంట్లు పెడుతున్నారు. మరి ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలా ఉంటుందో వేచి చూడాలి.