Begin typing your search above and press return to search.

నయనతార రిలేషన్షిప్స్.. నాగ్ ఏం చెప్పారంటే?

చాలా మంది హీరోయిన్స్ కి నయనతార ఒక రోల్ మోడల్ అని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   20 Nov 2024 11:59 AM IST
నయనతార రిలేషన్షిప్స్.. నాగ్ ఏం చెప్పారంటే?
X

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయనతార ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్ళు దాటింది. ఇన్నేళ్ల సుదీర్ఘ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించింది. దాదాపు సౌత్ లో అగ్ర హీరోలందరితో కలిసి పనిచేసింది. ప్రస్తుతం ఓ వైపు స్టార్ హీరోలతో మూవీస్ చేస్తూనే ఫీమేల్ సెంట్రిక్ కథలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకుంది. చాలా మంది హీరోయిన్స్ కి నయనతార ఒక రోల్ మోడల్ అని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే తాజాగా నెట్ ఫ్లిక్స్ ద్వారా నయనతార లైఫ్ స్టోరీలో ఎత్తుపల్లాలు, ఆమె ప్రయాణం గురించి డాక్యుమెంటరీ ఫిల్మ్ వచ్చింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్స్’ టైటిల్ తో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి ఉంది. ఇందులో నయనతార చాలా ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. హీరోయిన్స్ చాలా మంది తమ ఎక్స్ రిలేషన్ షిప్స్ గురించి అంత వేగంగా ఓపెన్ కారు. అయితే నయనతార మాత్రం రెండు రిలేషన్స్ షిప్స్ గురించి డాక్యుమెంటరీలో చెప్పింది.

అలాగే వారితో బ్రేక్ అప్ కి కారణాలు కూడా నయనతార తెలియజేసింది. ఇదిలా ఉంటే ఈ డాక్యుమెంటరీలో కింగ్ నాగార్జున కూడా నయనతార గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నయనతార కెరియర్ ఆరంభంలో నాగార్జునతో ‘బాస్’ మూవీ చేసింది. తరువాత 2013లో ‘గ్రీకువీరుడు’ సినిమా చేసింది. ఇదిలా ఉంటే ‘బాస్’ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనల కింగ్ నాగ్ చెప్పారు.

నయనతార తొలిసారి సెట్ లోకి వచ్చినపుడు ఆమె అందంతో పాటు నడకలో రాజసం కనిపించింది. కొద్ది రోజులు ఆమెతో కలిసి పనిచేసాక ఆమెతో స్నేహం చేయాలనిపించింది. నాతో మూవీ చేస్తోన్న సమయంలోనే ఆమె మరొకరితో రిలేషన్ షిప్ లో ఉంది. దాంతో నయనతార చాలా వర్రీ అవుతూ ఉండేదని నాగార్జున తెలిపారు. ఫోన్ రింగ్ అయితే ఆమెలో తెలియని టెన్షన్ కనిపించేది, మూడ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయేదని అన్నారు.

నువ్వొక ఇండిపెండెంట్ అమ్మాయివి, వర్రీ అవుతూ ఇలాంటి రిలేషన్ లో ఎందుకు ఉన్నావని నయనతారని అడిగానని డాక్యుమెంటరీలో నాగార్జున తెలిపారు. ఈ రిలేషన్ షిప్ గురించి నయనతార సైతం క్లారిటీ ఇచ్చింది. ఫస్ట్ టైం నా రిలేషన్ నమ్మకంతో ఏర్పడిందని అన్నారు. అయితే అది కోల్పోయిన తర్వాత ఎక్కువ కాలం ఉండలేకపోయానని తెలిపారు. కానీ రిలేషన్ షిప్ బ్రేక్ అప్ అయితే అబ్బాయిలని ఎవరూ నిందించరని, అమ్మాయిల వైపే వేలెత్తి చూపిస్తారని నయనతార తన మనసులో మాట చెప్పింది.