పాన్ ఇండియాపై నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
కింగ్ నాగ్ టాలీవుడ్‌లో చాలా వరకు ప్రయోగాలు చేశారు. కానీ పాన్ ఇండియా మూవీ మాత్రం చేయలేదు.
By: Tupaki Desk | 20 Jun 2025 4:58 PM ISTకింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా 'కుబేర'. ధనుష్ హీరోగా నటించగా, రష్మిక మందన్న అతనికి జోడీగా నటించింది. మన చుట్టూ ఉండే కథలకు సున్నితమైన భావోద్వేగాలని జోడించి తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది ప్రత్యేక శైలి. ఆయన నుంచి సినిమా వచ్చి దాదాపు మూడేళ్లకు పైనే అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన నుంచి వచ్చిన మూవీ 'కుబేర'. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి షో నుంచే ఈ మూవీ పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది.
శేఖర్ కమ్ముల, హీరోలు నాగార్జున, ధనుష్ తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా ఇది. సినిమా హిట్ అనే టాక్‌ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కింగ్ నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తీసినవి పాన్ ఇండియా సినిమాలు కాదని, ప్రేక్షకుల మెచ్చినవే పాన్ ఇండియా మూవీస్ అని ఆయన తేల్చి చెప్పడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
కింగ్ నాగ్ టాలీవుడ్‌లో చాలా వరకు ప్రయోగాలు చేశారు. కానీ పాన్ ఇండియా మూవీ మాత్రం చేయలేదు. కానీ పాన్ ఇండియా మూవీ అనే మాట వినిపించని టైమ్‌లోనే ఆయన 'శాంతి - క్రాంతి' పేరుతో కన్నడ హీరో, కమ్ డైరెక్టర్ వి.రవిచంద్రన్ నటించి రూపొందించిన మూవీలో నటించారు. దీన్ని కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేయడం చాలా మందికి తెలియదు. ఇక హీరోగా ఎన్నో ప్రయోగాలు చేసి ఎంతో మంది డైరెక్టర్లని ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాగ్ రీసెంట్ టైమ్స్‌లో అంటే పాన్ ఇండియా సినిమా అనే మాట వినిపించిన దగ్గరి నుంచి ఆయన ఆ తరహా సినిమా చేయలేదు.
అంతే నాగ్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ 'కుబేర' అన్నమాట. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీకి తొలి షోకే హిట్ టాక్ రావడంతో కలెక్షన్‌లు భారీగానే వస్తాయని తెలుస్తోంది. శేఖర్ మార్కు ఎమోషన్, డబ్బుచుట్టూ సాగే కథ కావడంతో ప్రేక్షకులు ఈ మూవీని ఓన్ చేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు 'కుబేర'కు ప్లస్ గా మారి హిట్‌గా నిలిపింది. మూడేళ్లు విరామం తీసుకున్నా శేఖర్ కమ్ముల చెప్పినట్టే హిట్ కొట్టాడని అంతా అంటున్నారు. అంతే కాకుండా ఆయనని నమ్మి ఈ సినిమా చేసిన నాగార్జున తన ఖాతాలో పాన్ ఇండియా హిట్‌ని వేసుకున్నారని, ఇది ఆయన కెరీర్‌కి మరింత ఎనర్జీని అందించి మరిన్ని కొత్త తరహా క్యారెక్టర్లకు శ్రీకారం చుట్టేలా చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
