Begin typing your search above and press return to search.

నాగ్ ఎక్క‌డున్నా రాత్రి 7కు అది అయిపోవాల్సిందే

అక్కినేని నాగార్జున‌ను అంద‌రూ మ‌న్మ‌థుడు అని పిలుచుకుంటార‌నే సంగ‌తి తెలిసిందే. ఈ టైటిల్ కు నాగ్ పేరు స‌రిగ్గా స‌రిపోతుంది.

By:  Tupaki Desk   |   16 July 2025 12:00 AM IST
నాగ్ ఎక్క‌డున్నా రాత్రి 7కు అది అయిపోవాల్సిందే
X

అక్కినేని నాగార్జున‌ను అంద‌రూ మ‌న్మ‌థుడు అని పిలుచుకుంటార‌నే సంగ‌తి తెలిసిందే. ఈ టైటిల్ కు నాగ్ పేరు స‌రిగ్గా స‌రిపోతుంది. 65 ఏళ్ల వ‌య‌సులో కూడా నాగ్ కుర్ర హీరోల‌కు పోటీగా త‌న అందాన్ని మెయిన్‌టెయిన్ చేస్తూ వ‌స్తున్నారు. నాగ్ 40 ఏళ్ల వ‌య‌సులో ఉన్నప్పుడెలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. దానికి కార‌ణం అత‌ను ఫాలో అయ్యే డైటే అని ఎన్నో సార్లు చెప్పారు నాగ్.

హీరోలంతా హెల్త్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటార‌నే విష‌యం తెలిసిందే. ఈ త‌రం హీరోలంతా త‌మ ఫిట్ నెస్ కోసం బాడీని హెల్తీగా ఉంచుకోవ‌డానికి గంట‌ల త‌ర‌బ‌డి జిమ్ లో గ‌డుపుతూ ఉంటారు. కానీ సీనియ‌ర్ హీరోల్లో మాత్రం నాగ్ లాగా ఎవ‌రూ ఫిట్‌నెస్‌ను మెయిన్‌టెయిన్ చేయ‌రు. కేవ‌లం నాగ్ చేసే ఫిట్‌నెస్, డైట్ వ‌ల్లే ఆయ‌న ఇప్ప‌టికీ య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు.

ప్రో బ‌యోటిక్స్ తో రోజును మొద‌లుపెట్టే నాగ్, కాసేపు వ్యాయామం చేసి ఆ త‌ర్వాత హాట్ వాట‌ర్, కాఫీ తీసుకుంటార‌ట‌. 7 గంట‌ల‌కు బ్రౌన్ బ్రెడ్, ఎగ్ వైట్స్ తీసుకుని 11 గంట‌ల‌కు సెకండ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటార‌ట‌. మ‌ధ్యాహ్న భోజ‌నంలో త‌ప్ప‌కుండా అన్నం తినే నాగార్జున లంచ్ లో బిర్యానీ కూడా తింటారు. అయితే ఇవ‌న్నీ నాగ్ సీక్రెట్స్ కాదు.

అస‌లైన సీక్రెట్ నాగ్ త‌న డిన్న‌ర్ ను రాత్రి 7 గంట‌ల‌కు పూర్తి చేస్తార‌ట‌. డిన్న‌ర్ లో చికెన్, ఫిష్, ఉడ‌క‌పెట్టిన కూర‌గాయ‌లు తీసుకునే నాగ్, ఆయ‌నెక్క‌డున్నా స‌రే 7 గంట‌ల‌కు డిన్న‌ర్ చేసేయాల్సింద‌న‌ట‌. గ‌త 35 ఏళ్లుగా నాగ్ ఈ రూల్ ను చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నార‌ట‌. ఏం తింటున్నామ‌నే దానితో పాటూ ఏ టైమ్ కు తింటున్నామ‌నేది కూడా చాలా ముఖ్య‌మ‌ని నాగార్జున అంటుంటారు. రాత్రి 7 త‌ర్వాత ఇక తానేమీ తిన‌నని చెప్తున్న నాగ్ ను చూసి ఈ కాలం యువ‌త ఎంతో నేర్చుకోవాలి.