లెనిన్ పూర్తయ్యాకే నాగ్ అనౌన్స్ మెంట్..?
కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్ చేయలేదు.
By: Tupaki Desk | 14 May 2025 6:11 AMకింగ్ నాగార్జున నా సామిరంగ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్ చేయలేదు. అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున తర్వాత సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కానీ నాగ్ మాత్రం ఎందుకో ఇంకా టైం తీసుకుంటున్నాడు. ఐతే నాగార్జున సినిమా లేట్ కి కారణం అక్కినేని అఖిల్ అని తెలుస్తుంది. అఖిల్ కూడా ఏజెంట్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. సూపర్ హిట్ కోసం ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న అఖిల్ ఈసారి పక్కా ప్లానింగ్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. అఖిల్ నెక్స్ట్ సినిమాకు లెనిన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టారో ఏమో కానీ టీజర్ తో సర్ ప్రైజ్ చేశారు.
ఐతే అఖిల్ లెనిన్ కి నాగార్జున నెక్స్ట్ సినిమాకు సంబంధం ఏంటంటే.. అఖిల్ లెనిన్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఐతే ఈ సినిమాకు నాగార్జున కూడా సహ నిర్మాతగా ఉన్నాడు. అన్నపూర్ణ బ్యానర్ కూడా లెనిన్ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా పనిచేస్తుంది. సో సితార, అన్నపూర్ణ రెండు బడా బ్యానర్ లు కలిసి ఈ సినిమా చేస్తున్నారు. నాగార్జున కూడా లెనిన్ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నాడట.
యువ హీరోలంతా డిఫరెంట్ సినిమాలతో మాస్ హిట్ కొడుతున్న నేపథ్యంతో ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి అఖిల్ వెనుకపడడం ఇబ్బంది కరంగా ఉంది. అందుకే నాగార్జున లెనిన్ మీద స్పెషల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. లెనిన్ సినిమా విషయంలో నాగ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆ సినిమా పూర్తైన తర్వాతే తన సొంత సినిమా చేయాలని అనుకుంటున్నాడట నాగార్జున.
నా సామిరంగ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నాగార్జున ఇలా ఫ్యాన్స్ ని వెయిటింగ్ లో పెట్టడం కాస్త ఇబ్బందిగానే అనిపించినా నెక్స్ట్ తన సినిమా విషయంలో కూడా భారీ ప్లానింగ్ తో ఉన్నారని తెలుస్తుంది. తప్పకుండా ఈసారి అటు అఖిల్ ఇటు నాగార్జున మరోసారి ఫ్యాన్స్ ని అలరించే సినిమాతో వస్తారని తెలుస్తుంది. నాగార్జున 100 సినిమా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయని టాక్. ఐతే మైల్ స్టోన్ మూవీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.