Begin typing your search above and press return to search.

అఖిల్ పెళ్లిలో కింగ్ నాగార్జున డాన్స్ వీడియో వైరల్..!

అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ కళ్యాణ వేడుకకు కేవలం అతికొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగింది.

By:  Tupaki Desk   |   6 Jun 2025 8:47 PM IST
అఖిల్ పెళ్లిలో కింగ్ నాగార్జున డాన్స్ వీడియో వైరల్..!
X

అక్కినేని అఖిల్ జైనబ్ ల మ్యారేజ్ అంగరంగ వైభవంగా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ కళ్యాణ వేడుకకు కేవలం అతికొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగింది. టాలీవుడ్ సెలబ్రిటీస్ చిరంజీవి, రామ్ చరణ్ అఖిల్ పెళ్లికి అటెండ్ అయినట్టు తెలుస్తుంది. శుక్రవారం తెల్లవారుజామున అఖిల్ జైనబ్ ల పెళ్లి జరిగింది. ఈ వేడుకలో నాగార్జున చాలా సంతోషంగా కనిపించినట్టు తెలుస్తుంది. అంతేకాదు సంగీత్ లో కింగ్ నాగార్జున డాన్స్ కూడా వేసినట్టు తెలుస్తుంది.

అఖిల్ పెళ్లిలో సందడి అంతా నాగార్జునదే అన్నట్టుగా సందడి చేశారట. చిన్న కొడుకు పెళ్లితో తన బాధ్యత తీరిందనే సంతోషంలో నాగార్జున ఫుల్ కుషిగా కనిపించారట. అఖిల్ పెళ్లి టైం లో నాగార్జున డాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాగార్జున ఐకానిక్ స్టెప్ వేస్తూ సూపర్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. నాగార్జున ఇంతగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఈమధ్య కాలంలో చూడలేదు.

నాగార్జున డాన్స్ చేస్తుంటే పెళ్లి కొడుకు అఖిల్ అతని సోదరుడు యువ సామ్రాట్ నాగ చైతన్య కూడా జత కలిశారు. అక్కినేని అందగాళ్లంతా కలిసి కాలు కదిపి డాన్స్ చేశారని తెలుస్తుంది. అఖిల్ పెళ్లి వేడుకలో చిరంజీవి కూడా సందడిగా కనిపించారని తెలుస్తుంది. చిరంజీవి, నాగార్జున మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే చిరంజీవిని నాగార్జున తన ప్రతి ఇంటి వేడుకకు ఆహ్వానిస్తాడు.

ఇక త్వరలోనే అఖిల్ మ్యారేజ్ రిసెప్షన్ ఉంటుందని తెలుస్తుంది. ఐతే దాన్ని చాలా గ్రాండ్ గా టాలీవుడ్ సినీ సెలబ్రిటీస్ తో పాటుగా రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారని తెలుస్తుంది. కెరీర్ పరంగా అక్కినేని హీరోలంతా బిజీ బిజీగా ఉన్నా కూడా అఖిల్ పెళ్లి వేడుకలకు అన్నిటినీ పక్కన పెట్టి పెళ్లి సందడిలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇక అఖిల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అతను లెనిన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈమధ్యనే లెనిన్ టీజర్ రిలీజ్ కాగా సినిమాపై ఆ టీజర్ అంచనాలు పెంచింది. అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో అఖిల్ భారీ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. నాగార్జున మాత్రం తన సోలో సినిమాకు టైం తీసుకుంటున్నాడు. ఐతే ధనుష్ తో కుబేర, రజినీకాంత్ తో కూలీ సినిమాల్లో సర్ ప్రైజ్ రోల్స్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరించడానికి రెడీ అవుతున్నాడు నాగార్జున.