నాగ్ కెరీర్‌కు 2025 గుడ్ టర్న్ ఇస్తుందా?
కింగ్ నాగార్జున.. సెల్యూలాయిడ్ సైంటిస్ట్‌గా పేరుతెచ్చుకున్న ఆయన గత కొంత కాలంగా తన ఫామ్‌ని పూర్తిగా కోల్పోయారు.
By: Tupaki Desk | 19 Jun 2025 5:00 AM ISTకింగ్ నాగార్జున.. సెల్యూలాయిడ్ సైంటిస్ట్‌గా పేరుతెచ్చుకున్న ఆయన గత కొంత కాలంగా తన ఫామ్‌ని పూర్తిగా కోల్పోయారు. కెరీర్ ప్రారంభం నుంచి న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీకి ఎంతో మంది క్రేజీ డైరెక్టర్లని అందించారు. వర్మ, పూరీ, ప్రియదర్శన్ (నిర్ణయంతో తెలుగుకు పరిచయం), రవిచంద్రన్ (శాంతి క్రాంతి తొలి పాన్ ఇండియా మూవీ).. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది.
అలా టాలెంటెడ్ పీపుల్స్‌ని డైరెక్టర్స్‌గా పరిచయం చేసిన నాగార్జున గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన 'ఊపిరి' తరువాత నాగ్ హిట్టు మాట విని ఏళ్లు గడుస్తున్నాయి. ఈ సినిమా తరువాత నాగార్జున చేసిన సినిమాలన్నీ దాదాపుగా యావరేజ్‌లు, డిజాస్టర్లే ఎక్కువ. దీంతో నాగ్ `బ్రహ్మాస్త్ర`తో కొత్త మార్గం పట్టారు. అదే కీ రోల్స్.
ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లలో పవర్ ఫుల్ క్యారెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ఒకటి ధనుష్ హీరోగా నటించిన 'కుబేర', రెండవది అతని మామ, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న 'కూలీ'. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయి రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. 'కుబేర' జూన్ 20న రిలీజ్ కాబోతుండగా, `కూలీ` ఆగస్టు 14న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ రెండు సినిమాలపై నాగ్‌భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాల హిట్‌తో తనకు ఆర్టిస్ట్‌గా కొత్త దారి ఏర్పడుతుందని ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో తను హీరోగా వందవ ప్రాజెక్ట్‌ని కూడా పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. అది కూడా ఇదే ఏడాది పట్టాలెక్కబోతోంది. ఈ నేపథ్యంలోనే `కుబేర`, కూలీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిస్తే నాగ్ కెరీర్ మరో టర్న్ తీసుకోవడం ఖాయం. అందుకే 2025 నాగ్‌కు కెరీర్ టర్నింగ్ ఇయర్ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే నాగార్జునకు ఆఫర్లు వెల్లువెత్తడం ఖాయమని, ఆయనని దృష్టిలో పెట్టుకుని ఇకపై దర్శకులు కొత్త కథలు రాస్తారు.