‘కూలీ’ తెలుగు రైట్స్‌తో నాగ్ బిగ్ రిస్క్.. గ్రాస్ ఎంత రావాలి?
రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమా టాలీవుడ్‌లో భారీ హైప్‌ను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
By: Tupaki Desk | 2 Jun 2025 12:00 PM ISTరజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమా టాలీవుడ్‌లో భారీ హైప్‌ను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, రెబా మోనికా జాన్ వంటి స్టార్ కాస్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.
అమీర్ ఖాన్ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నాడనే వార్త ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీతో ఈ సినిమా టెక్నికల్‌గా బలంగా ఉంది. ‘కూలీ’ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది. ఈ సినిమా టీజర్‌లో రజనీకాంత్ గోల్డ్ చైన్‌తో చేసే యాక్షన్ సీన్ అభిమానులను ఆకర్షించింది.
నాగార్జున సైమన్ అనే డాన్ పాత్రలో నటిస్తున్నాడు, ఈ రోల్ కోసం ఆయన రూ. 24 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ భారీ డిమాండ్‌ను సృష్టిస్తోంది, డిజిటల్, సాటిలైట్ రైట్స్ రూ. 240 కోట్లకు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొంది.
ఇక తాజా సమాచారం ప్రకారం, ‘కూలీ’ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున రూ. 60 కోట్లకు (GSTతో సహా) సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. ఇది నిజమైతే తమిళ డబ్బింగ్ సినిమాల్లో రికార్డ్ ధరగా నిలిచింది. గతంలో సూర్య ‘కంగువ’ రూ. 25 కోట్లకు, విజయ్ ‘లియో’ రూ. 20 కోట్లకు, రజనీకాంత్ ‘జైలర్’ రూ. 17 కోట్లకు అమ్ముడుపోయాయి.
ఈ డీల్‌తో నాగార్జున డిస్ట్రిబ్యూటర్‌గా ఇంత భారీ రిస్క్ ఇంతవరకు తీసుకోలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు పెద్ద సినిమాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ లో పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఈ సారి నాగ్ నమ్మకంతో రిస్క్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యారు. ఈ రైట్స్ డీల్‌తో ‘కూలీ’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కోసం రూ. 110 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంటుందని అంచనా.
రజనీకాంత్, నాగార్జున కాంబో, లోకేష్ బ్రాండ్ వాల్యూ, స్టార్ కాస్ట్‌తో ఈ టార్గెట్ సాధ్యమేనని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ఈ సినిమా ఆగస్టు 14న హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’తో బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టనుంది. ఈ భారీ క్లాష్ సినిమా వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా, ‘కూలీ’ సినిమా తెలుగు రైట్స్ డీల్‌తో నాగార్జున భారీ రిస్క్ తీసుకున్నాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
