తెలుగు బిగ్‌బాస్ పుకార్లకు ఫుల్‌స్టాప్.. అసలు నిజం ఇదే!
తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్‌లను పూర్తి చేసుకుంది, ఒక ఓటీటీ సీజన్‌తో కలిపి ఇప్పటి వరకు మొత్తం 9 సీజన్‌లు జరిగాయి. 9 సీజన్‌లలో మొదటి సీజన్‌కి ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తే, రెండో సీజన్‌కి నాని హోస్టింగ్ చేశాడు.
By: Tupaki Desk | 12 Jun 2025 10:59 AM ISTతెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్‌లను పూర్తి చేసుకుంది, ఒక ఓటీటీ సీజన్‌తో కలిపి ఇప్పటి వరకు మొత్తం 9 సీజన్‌లు జరిగాయి. 9 సీజన్‌లలో మొదటి సీజన్‌కి ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తే, రెండో సీజన్‌కి నాని హోస్టింగ్ చేశాడు. ఆ తర్వాత అన్ని సీజన్‌లకు కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించాడు. మధ్యలో వచ్చిన ఓటీటీ సీజన్‌ను సైతం నాగ్ హోస్ట్ చేయడం జరిగింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కి ఆశించిన స్థాయిలో రేటింగ్ రాలేదు అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. ఆ కారణంగానే హోస్ట్‌ను మార్చే యోచనలో నిర్వాహకులు ఉన్నారు అంటూ కొందరు, ఇప్పటికే చాలా సీజన్‌లు చేశాను కనుక ఇక బిగ్ బాస్‌కి గుడ్ బై చెప్పే టైం వచ్చిందని నాగార్జున ఆలోచిస్తున్నాడనే పుకార్లు షికార్లు చేశాయి.
ప్రతి సీజన్ ప్రారంభ సమయంలో హోస్ట్ గురించి, కంటెస్టెంట్స్ గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా హోస్ట్ గురించి ప్రముఖంగా పుకార్లు షికార్లు చేశాయి. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ మొదలుకుని పలువురు హీరోల పేర్లు బిగ్ బాస్ హోస్ట్‌గా వినిపించాయి. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కి ఆ హీరో హోస్ట్, ఈ హీరో హోస్టింగ్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ పుకార్లు పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగాయి. దాంతో చాలా మంది బిగ్ బాస్‌కి కొత్త హోస్ట్ రావడం ఖాయం అని, తెలుగు బిగ్ బాస్‌కి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. ఆ విషయమై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంకు సమయం దగ్గర పడింది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో టీం చర్చలు జరుపుతోంది. వంద మందితో కూడిన జాబితాను ఇప్పటికే టీం రెడీ చేసిందని, అందులోంచి టాప్ 25 మందిని ఎంపిక చేస్తారు. అందులో నుంచి ఫైనల్ కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి, సెలబ్రిటీ హోదా, సోషల్ మీడియా ఫాలోవర్స్ ఇలా అన్నింటిని బేరీజు వేసుకుని పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్యూలెన్సర్స్‌ను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈసారి సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఎక్కువ మంది ఉండే అవకాశాలు ఉన్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ నిర్వాహకులు ఇటీవలే నాగార్జునను హోస్ట్‌గా కన్ఫర్మ్ చేసి, పారితోషికం విషయంలో క్లారిటీ ఇచ్చారు.
ఈ మధ్య కాలంలో నాగార్జున వరుస సినిమాలు చేయడం లేదు. ఆయన నా సామి రంగ సినిమా తర్వాత సోలో హీరోగా ఒక్క సినిమాకు కూడా ఇప్పటి వరకు కమిట్ కాలేదు. కానీ ధనుష్ తో కలిసి కుబేరలో నటించాడు, అంతే కాకుండా రజనీకాంత్ మూవీ కూలీలోనూ నాగార్జున కనిపించబోతున్నాడు. ఈ ఏడాది చివరి వరకు సోలో హీరోగా నాగార్జున సినిమా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అది ఎవరితో అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 9కి హోస్ట్‌గా ఓకే చెప్పాడు. తెలుగు బిగ్ బాస్ కి హోస్ట్ మారబోతున్నాడు అనే వార్తలు పూర్తిగా అవాస్తవం. అసలు విషయం ఏంటి అనేది షో నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు, ఒకటి రెండు వారాల్లో నాగార్జున పై ప్రోమో చిత్రీకరణ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
