Begin typing your search above and press return to search.

కింగ్ మ‌న‌సులో చ‌ర‌ణ్‌-తార‌క్!

చిరంజీవి-హ‌రికృష్ణ త‌న‌యులు కూడా నాగార్జున‌ను అంతే అభిమానిస్తారు. రామ్ చ‌ర‌ణ్ కు నాగ్ అంటే ఎంతో అభిమానం.

By:  Tupaki Desk   |   27 Jun 2025 11:06 AM IST
కింగ్ మ‌న‌సులో చ‌ర‌ణ్‌-తార‌క్!
X

మెగాస్టార్ చిరంజీవి- నంద‌మూరి హ‌రికృష్ణ‌తో కింగ్ నాగార్జున బాండింగ్ అన్న‌ది ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ఇద్ద‌రితోనూ నాగార్జున‌కు మంచి అనుబంధం ఉంది. చిరంజీవి బెస్ట్ ప్రెండ్ అయితే? హ‌రికృష్ణను సొంత అన్న‌య్యాలా భావిస్తారు. నాగార్జునను త‌మ్ముడు అంటూ హ‌రికృష్ణ కూడా అంతే అభిమానించేవారు. ఇక చిరంజీవి నాగ్ పై చూపించే అభిమానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. చిరు ఓలెజెండ‌రీ న‌టుడైనా? త‌న‌కు ఎన్నో విష‌యాల్లో నాగార్జున‌ను స్పూర్తిగా భావిస్తుంటారు.

చిరంజీవి-హ‌రికృష్ణ త‌న‌యులు కూడా నాగార్జున‌ను అంతే అభిమానిస్తారు. రామ్ చ‌ర‌ణ్ కు నాగ్ అంటే ఎంతో అభిమానం. నాగార్జున గారు పిల‌వాలేగానీ ఆయ‌న మాట వేద వాక్కుతో స‌మానంగా భావిస్తారు. ఇక తార‌క్ తో ఎన్టీఆర్ బాండింగ్ ఇంకా స్పెష‌ల్. నాగార్జునన‌ను తార‌క్ బాబాయ్ అంటూ ఎంతో ప్రేమ‌గా పిలు స్తాడు. నాగార్జున కూడా మా పెద్ద పెద్ద అబ్బాయ్ అంటూ తార‌క్ ను అంతే ప్రేమిస్తాడు.

ఇలాంటి బాండింగ్ అన్న‌ది అంద‌రి మ‌ద్య సాద్యం కాదు. కొంద‌రికే సాధ్య‌మ‌వుతుంది. అలా చిరు-హ‌రికృష్ణ కుటుంబాల‌తో నాగార్జున‌కు ఓంతో ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఏర్ప‌డింది. తాజాగా అక్కినేని కాంపౌండ్ వ‌ర్గా నుంచి ఓ న్యూస్ లీకైంది. నేటి జ‌న‌రేష‌న్ స్టార్ హీరోల్లో చ‌ర‌ణ్‌...తార‌క్ చిత్రాల్లో నాగార్జున న‌టించాలనుకుంటున్నారుట‌. చాలా కాలంగా కింగ్ మ‌న‌సులో ఈ కోరిక ఉందిట‌.

కాంబినేష‌న్ సెట్ అయితే నాగార్జున న‌టించ‌డానికి సిద్దంగా ఉన్నార‌ని లీక్ అందింది. ఈ విష‌యం చ‌ర‌ణ్‌-తార‌క్ నాగ్ ను ఎర్ర తివాచీ వేసి మ‌రీ ఆహ్వానిస్తారు. కానీ కాంబినేష‌న్ క‌ల‌వ‌డం అన్న‌ది అంత వీజీ కాదు. వాళ్ల ఇమేజ్ కు త‌గ్గ స్టోరీలు పాత్ర‌లు సెట్ అవ్వాలి. ఇలా బోలెడంత త‌తంగం ఉంటుంది.