Begin typing your search above and press return to search.

సేమ్ రోల్స్ బోర్ కొట్టేశాయ్.. అప్పుడే కుబేర ఒప్పుకున్నా!: నాగ్

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున.. ఇప్పుడు కుబేర మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Jun 2025 6:20 PM IST
సేమ్ రోల్స్ బోర్ కొట్టేశాయ్.. అప్పుడే కుబేర ఒప్పుకున్నా!: నాగ్
X

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున.. ఇప్పుడు కుబేర మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. జూన్ 20న మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ ముంబైలో మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆ సమయంలో నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

"అందరికీ నమస్కారం.. ఎలా ఉన్నారు.. ఇక్కడికి వస్తున్న ప్రతీసారి కురిపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. ఈసారి ఎయిర్ పోర్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి మీ ప్రేమ కనిపిస్తుంది. కెరీర్ మొదలు నుంచి చూసుకుంటే.. శివ సహా అనేక చిత్రాలను మీరు ఆదరించారు. అందుకు గ్రాటిట్యూడ్ తో చాలా థ్యాంక్స్ చెబుతున్నా" అంటూ నాగార్జున స్టార్ట్ చేశారు.

"ఇప్పుడు కుబేరా మూవీ చాలా స్పెషల్ అని చెప్పాలి. నెక్స్ట్ ఏం చేద్దాం.. ఏం చేయాలి.. సేమ్ రోల్స్ చేయాలనిపించలేదు. అప్పుడే కుబేరా నా దగ్గరకు వచ్చింది. శేఖర్ కమ్ముల వచ్చి సినిమాలో ఈ రీల్ చేస్తారా అని అడిగారు. నేను ఆఫర్ కోసం అడగకుండానే వెంటనే ఎస్ చెప్పేశాను" అని నాగార్జున తెలిపారు.

"ఎందుకంటే శేఖర్ కమ్ముల తీసిన సినిమాలను ఇప్పటికే చూశాను. ఆయనొక బ్రిలియంట్ డైరెక్టర్. ఆయన స్టోరీలు చాలా సెన్సిబుల్. ఆయన మనసు కూడా ప్యూర్ గా ఉంటుంది. అందుకే శేఖర్ కమ్ముల సినిమాల్లో నటించాలనుకుంటా. కుబేరా యాక్సెప్ట్ చేశాక చూస్తే సినిమాలో అంతా స్టార్ క్యాస్టింగ్ ఉంది" అని చెప్పారు.

"జిమ్ సర్బ్ తో నటించడం హ్యాపీగా, గౌరవంగా ఉంది. ఆయన నటన ఔట్ స్టాండింగ్. నాకన్నా తెలుగు డైలాగ్స్ ఆయనే బాగా చెప్పారు. రష్మిక పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్. మూడేళ్లుగా అద్బుతంగా రాణిస్తోంది. రెండు వేల కోట్లు, మూడు వేల కోట్ల సినిమాలు రష్మిక మాత్రమే చేయగలదు. మమ్మల్ని కూడా బీట్ చేస్తుంది. ఆమె ఒక బ్రిలియంట్" అంటూ ప్రశంసించారు.

సినిమాతో ఫుల్ గా నవ్విస్తుందని చెప్పారు నాగార్జున. మూవీలో నలుగురు కొత్త వాళ్లు నటించారని, చాలా బాగా యాక్ట్ చేశారని తెలిపారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారని కొనియాడారు. ఆయన వర్క్ తో మూవీని లిఫ్ట్ చేశారని అన్నారు. ధనుష్ ఫుల్ టాలెంటెడ్ అంటూ ప్రశంసించారు. తన క్యారెక్టర్ తో లీనమవుతారని అన్నారు. కుబేర మూవీ టీమ్ తో వర్క్ చేయడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.