కూలీలో అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి
అయితే తాజాగా నాగార్జున ఓ సందర్భంగా మాట్లాడుతూ తాను కుబేర, కూలీ సినిమాల్లో చేస్తున్న పాత్రలు రెండూ పూర్తి భిన్నంగా ఉంటాయని తెలిపాడు.
By: Tupaki Desk | 13 Jun 2025 11:55 AM ISTటాలీవుడ్ సీనియర్ హీరోలంతా వరుసపెట్టి సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లు అందుకుంటుంటే అక్కినేని నాగార్జున మాత్రం నా సామిరంగ తర్వాత సోలోగా మరో సినిమాను అనౌన్స్ చేసింది లేదు. తన 100వ సినిమా మరింత గ్రాండ్ గా ఉండాలని ప్లాన్ చేస్తున్నప్పటికీ నాగార్జునకు ఎన్ని కథలు వింటున్నా ఎవరూ ఆయన్ని ఇంప్రెస్ చేయలేకపోతున్నారు.
దీంతో నాగార్జున తన 100వ సినిమాను పక్కన పెట్టి వేరే హీరోలు నటిస్తున్న సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. అలా నాగార్జున కీలక పాత్రల్లో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తోన్న కుబేర కాగా, మరొకటి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రానున్న కూలీ.
ఈ రెండు సినిమాల్లో నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నాడు. అయితే తాజాగా నాగార్జున ఓ సందర్భంగా మాట్లాడుతూ తాను కుబేర, కూలీ సినిమాల్లో చేస్తున్న పాత్రలు రెండూ పూర్తి భిన్నంగా ఉంటాయని తెలిపాడు. ఈ రెండు సినిమాలు చూశాక ఆడియన్స్ కచ్ఛితంగా చాలా కొత్తగా ఫీలవుతారని, ఈ రెండు పాత్రలూ తనకు మంచి సంతృప్తిని ఇచ్చాయని నాగ్ వెల్లడించాడు.
కూలీ సినిమాలో తాను సైమన్ అనే చాలా ముఖ్యమైన పాత్రలో నటించానని, లోకేష్ తనకు కూలీ సినిమా విజువల్స్ ను చూపించాడని, ఆ విజువల్స్ బ్లాస్ట్ లా అనిపించాయని, సినిమాలో లోకేష్ తననెంతో స్టైలిష్ గా ప్రెజెంట్ చేశాడని, లోకేష్ లార్జర్ దేన్ లైఫ్ డైరెక్టర్ అని, కూలీ సినిమా మొత్తం మీద విజిల్ వేసే సీన్స్ చాలా ఉన్నాయని చెప్పిన నాగార్జున, కుబేరలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, శేఖర్ తన క్యారెక్టర్ ను సరికొత్తగా డిజైన్ చేశాడని, ఆయన చాలా రియలిస్టిక్ డైరెక్టర్ అని చెప్పాడు నాగార్జున.
