Begin typing your search above and press return to search.

ధనుష్ సినిమాలో.. నాగ్ సర్ సెకండ్‌ ఇన్నింగ్స్?

ధనుష్ నటించబోతున్న సినిమా లో నాగార్జున కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది

By:  Tupaki Desk   |   26 July 2023 7:05 AM GMT
ధనుష్ సినిమాలో.. నాగ్ సర్ సెకండ్‌ ఇన్నింగ్స్?
X

నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా.. ఊపిరి సినిమా తర్వాత ఆ స్థాయి సక్సెస్ లను సొంతం చేసుకోలేక పోయాడు. మధ్యలో బంగార్రాజు కాస్త పర్వాలేదు అనిపించినా కూడా అక్కినేని ఫ్యాన్స్ ను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. అయినా కూడా అక్కినేని ఫ్యాన్స్ నాగ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

వైల్డ్ డాగ్‌.. ది ఘోస్ట్‌ సినిమాలపై చాలా ఆశలు, నమ్మకం పెట్టుకుని చేసిన నాగార్జున ఆ సినిమాలు తీవ్రంగా నిరాశ పరచడం తో కథల ఎంపిక విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటాడని అభిమానులు ఆశించారు. ది ఘోస్ట్‌ తర్వాత గ్యాప్‌ తీసుకున్న నాగార్జున ఆ మధ్య ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఆ సినిమా ప్రారంభం అయినట్లుగా కూడా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.

ఆ తర్వాత చిరంజీవి గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో నాగార్జున ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి.

అవన్నీ సినిమాలు పక్కన పెట్టి శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటించబోతున్న సినిమా లో నాగార్జున కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.

నాగార్జున గతంలో కూడా ఇతర హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాడు. అయితే ఈసారి గెస్ట్‌ గా కనిపించేందుకు సిద్ధం అవ్వడంతో ఇక ముందు అన్నీ కూడా అలాంటి పాత్రలే చేస్తాడా అనే చర్చ మొదలైంది.

నాగ్‌ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేయబోతున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హీరోగా నాగార్జున ఇంకా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ధనుష్ సినిమా తర్వాత నాగార్జున చేయబోతున్న సినిమా ఏంటి అనేది అందరిలో ఆసక్తి ని రేకెత్తిస్తోంది.