Begin typing your search above and press return to search.

కింగ్ 100.. ఏ ఫెస్టివల్ ను ఫిక్స్ చేశారో..

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున 100వ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  M Prashanth   |   12 Jun 2026 12:10 AM IST
కింగ్ 100.. ఏ ఫెస్టివల్ ను ఫిక్స్ చేశారో..
X

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున 100వ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రా కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ మైల్ స్టోన్ మూవీ గురించి వస్తున్న ప్రతి అప్డేట్ ఆసక్తిని పెంచుతోంది. అయితే ఇప్పుడు ఆ మూవీ విడుదల తేదీ గురించి చర్చ జరుగుతోంది. మొదట ఆ సినిమాను 2026 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని ప్రచారం జరిగింది. షూటింగ్ షెడ్యూల్స్ కూడా అదే టార్గెట్ తో ప్లాన్ చేశారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు సంక్రాంతి బరిలోకి దింపనున్నారని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. మిగిలిన పార్ట్ కూడా త్వరగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వందో సినిమా కావడంతో ఎక్కడా రాజీ పడకుండా ది బెస్ట్ అనేలా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నాగార్జున నిర్ణయించుకున్నారట. అయితే మొదట దసరా రిలీజ్‌ ను టార్గెట్ చేసిన మేకర్స్, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం అవసరమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు, సంక్రాంతి సీజన్‌ కు ఉండే ప్రత్యేక క్రేజ్, ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్, పండగ సెలవులు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని విడుదలను వాయిదా వేసే ఆలోచన చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నాగార్జునకు కూడా సంక్రాంతి సీజన్‌ లో విడుదలైన పలు చిత్రాలు మంచి రిజల్ట్స్ ఇచ్చిన నేపథ్యంలో అదే సెంటిమెంట్‌ ఫాలో కావాలనే ఆలోచనలో ఉన్నారట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఆ చిత్రం క్రైమ్, మనీ హీస్ట్ అంశాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతోందని సమాచారం. రెండు జెనరేషన్స్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీతో సినిమా సాగుతుందని తెలుస్తోంది.

ఇక సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపించనున్న నాగార్జున సరసన సీనియర్ స్టార్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తుండటం మరో విశేషం. చాలా ఏళ్ల తర్వాత ఆ హిట్ జోడీ స్క్రీన్ పై కనిపించనుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో హీరోయిన్‌ గా సుస్మిత భట్ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే నాగార్జున యంగ్ లుక్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగిస్తున్నారని వినికిడి.

ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెలలోనే ఫస్ట్ సింగిల్‌ ను విడుదల చేసే అవకాశముందని సమాచారం. అదే సమయంలో సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ టీజర్‌ కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్ దసరా నుంచి సంక్రాంతికి షిఫ్ట్ అయ్యిందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆ విషయంపై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏదేమైనా తన వందో సినిమాను అభిమానులకు ఓ పండగలా మార్చాలని నాగార్జున గట్టిగా ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది.