నాగార్జున సెంచరీ గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లోనా!
కింగ్ నాగార్జున 100 చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ల్యాండ్ మార్క్ చిత్రం కావడంతో? పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
By: Tupaki Desk | 13 May 2025 6:28 AMకింగ్ నాగార్జున 100 చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ల్యాండ్ మార్క్ చిత్రం కావడంతో? పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. స్టోరీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడంలేదు. ఇప్పటికే చాలా మంది దర్శకులు స్టోరీలు వినిపించారు. కానీ ఆవేవి కింగ్ ని మెప్పించలేకపోయాయి. నచ్చిన స్టోరీల విషయంలో సరైన డెవలెప్ మెంట్స్ కుదరడంతో ముందడుగు పడలేదు.
ఈ నేపథ్యంలో తమిళ్ డైరెక్టర్ రా కార్తీక్ పేరు తెరపైకి వచ్చింది. ఇతడేమి స్టార్ డైరెక్టర్ కాదు. సక్సెస్ రికార్డులేవు. తమిళం లో `నీతమ్ ఒరు వానం` అనే సినిమా చేశాడు. ఇది తెలుగులో `ఆకాశం` పేరుతో రిలీజ్ అయింది. రెండు చోట్లా కూడా ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే నాగ్ ఇప్పుడీ డైరెక్టర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇటీవలే స్టోరీ వినిపించినట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది.
తాజాగా ఇదొక మాఫియా బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ జోనర్ కథ అని తెలిసింది. స్టోరీలో ఆ పాయింట్ కే నాగార్జున ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రధమార్ధం పూర్తి స్టోరీని నేరేట్ చేసాడట. అది నాగ్ కి బాగా నచ్చింది. ప్రస్తుతం ద్వితియార్ధం కథ రెడీ అవుతుందని సమాచారం. ఇటీవలే స్టోరీకి సంబంధించి పనులు ఎంతవరకూ వచ్చాయని నాగార్జున స్వంయగా ఫోన్ చేసి వివరాలు ఆరా తీసారట.
అందుకు కార్తీక్ మరో రెండు..మూడు నెలలు సమయం పట్టొచ్చాని చెప్పారట. దీంతో నాగ్ కూడా కావాల్సినంత సమయం తీసుకుని ద్వితి యార్ధం బాగా ఉండేలా చూడమన్నారట. సెకెండ్ హాఫ్ నచ్చితే నాగ్ సెంచరీ కన్పమ్ అయినట్లే. ప్రస్తుతం నాగార్జున 'కూలీ','కుభేర' చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమా కథలు కూడా గ్యాంగ్ స్టర్ స్టోరీలే. దీంతో నాగ్ ఆ స్టోరీలకు బాగా కనెక్ట్ అయినట్లు కనిపిస్తుంది.