హిట్ ఇచ్చినా డైరెక్టర్ ని నమ్మని నాగార్జున..?
ధనుష్ తో కుబేర సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నా కూడా అది ఆయన సినిమా కిందకు వచ్చే ఛాన్స్ లేదు.
By: Tupaki Desk | 22 April 2025 8:00 AM ISTనా సామిరంగ సినిమా తర్వాత కింగ్ నాగార్జున నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయలేదు. ధనుష్ తో కుబేర సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నా కూడా అది ఆయన సినిమా కిందకు వచ్చే ఛాన్స్ లేదు. మరోపక్క కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీలో కూడా నటిస్తున్నాడు నాగార్జున. అంతా బాగుంది కానీ నాగార్జున నెక్స్ట్ సినిమా ఎప్పుడు అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
నా సామిరంగ సినిమాతో సక్సెస్ అందుకున్న నాగార్జున ఇక మీదట ప్రతి సంక్రాంతికి ఒక సినిమాతో వస్తాయని ఫ్యాన్స్ కి చెప్పాడు. కానీ ఈ సంక్రాంతి మిస్ అయ్యాడు. నెక్స్ట్ సంక్రాంతికి అయినా వస్తాడా లేడా అన్న క్లారిటీ లేదు. నా సామిరంగ తర్వాత ఇంతవరకు ఏ కథను ఓకే చేయలేదు. ఐతే ఆ సినిమా డైరెక్టర్ విజయ్ బిన్ని మరో కథ చెప్పినా నాగ్ సార్ సాటిస్ఫై అవ్వలేదని టాక్.
విజయ్ బిన్ని నా సామిరంగ కన్నా ముందే తన సొంత కథతోనే నాగార్జునతో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ నా సామిరంగ కథ చేతిలో పెట్టి ఇది తీసి చూపించమని చెప్పగానే అతను అదే చేశాడు. ఐతే హిట్ ఇచ్చాడు కాబట్టి ఈసారి అతని సొంత కథతో సినిమా చేయాలని అనుకోగా అది మాత్రం ఇప్పుడు అప్పుడు అంటూ లేట్ చేస్తున్నారట.
త్వరలోనే 100 సినిమా చేయబోతున్న నాగార్జున తన సినిమాల కథల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు. విజయ్ బిన్ని కథ నచ్చినా స్క్రీన్ ప్లే విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి నాగార్జున నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరు.. ఆ సినిమా ఎలాంటి కథతో వస్తుందో తెలియాల్సి ఉంది.
నాగార్జున నెక్స్ట్ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కథల విషయంలో నాగార్జున ఫోకస్ తో ఉన్నారని టాక్. మరి నెక్స్ట్ సినిమా భారీ టార్గెట్ పెట్టుకున్న మన కింగ్ ఎలాంటి కథను పిక్ చేసుకుంటారన్నది చూడాలి. హిట్ ఇచ్చినా కూడా డైరెక్టర్ ని నమ్మకపోతే ఎలా అనుకుంటూ కొందరు అనుకుంటుంటే మరికొందరు మాత్రం ఈసారి నాగార్జున ప్లాన్ ఒక రేంజ్ లో ఉందని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ వెయిటింగ్ ఫ్యాన్స్ కి డబుల్ అంచనాలు ఏర్పరచేలా చేస్తున్నా కూడా మరీ లేట్ అయితే కష్టమే అని అనుకుంటున్న వారు ఉన్నారు.
