నాగార్జునకు జోడీగా కత్రినా కైఫ్?
కింగ్ నాగార్జున కథానాయకుడిగా తమిళ దర్శకుడు రా కార్తీక్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇది నాగార్జున 100వ చిత్రం కావడం విశేషం.
By: Tupaki Desk | 13 July 2025 2:00 AM ISTకింగ్ నాగార్జున కథానాయకుడిగా తమిళ దర్శకుడు రా కార్తీక్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇది నాగార్జున 100వ చిత్రం కావడం విశేషం. ఎంతో మంది దర్శకుల్ని పరిశీలించి చివరిగా ఆ ఛాన్స్ కార్తీక్ కి ఇచ్చారు. దర్శకుడిగా పెద్దగా అనుభవం లేకపోయినా కథపై నమ్మకంతో కింగ్ ముందుకెళ్తున్నారు. స్టోరీ లైన్ ఏంటి? అన్నది ఇంతవరకూ బయటకు రాలేదు. కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం వేగంగా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో నాగార్జున కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పేరు తెరపైకి వచ్చింది. ఇందులో హీరోయిన్ గా కత్రినా ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. కింగ్ రెగ్యులర్ చిత్రలకు భిన్నంగా ఉండే చిత్రమట. సినిమాను పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారట. ఈనేపథ్యంలో మార్కెట్ పరంగా వర్కౌట్ అవ్వాలంటే? కత్రినా అయితే బాగుంటుందని మేకర్స్ ఇలా ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరి కత్రినా ఈ అవకాశం పట్ల ఎలా స్పందిస్తుందో చూడాలి.
కత్రినా కైఫ్ ఇప్పటికే టాలీవుడ్లో ఓ చిత్రం చేసింది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'మల్లీశ్వరి' చిత్రంలో కెరీర్ ఆరంభంలో కత్రినా హీరోయిన్ గా నటించింది. ఆ కామెడీ ఎంటర్ టైనర్ మంచి విజయం సాధించింది. వెంకీతో పాటు క్యాట్ పెర్పార్మెన్స్ నవ్విస్తుంది. అలా అమ్మడు ఆనాడే తెలుగు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. దీంతో తర్వాత కాలంలో తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి. చాలా మంది స్టార్ హీరోలతో ఛాన్సులొచ్చాయి. కానీ కత్రినా మాత్రం ఆ ఛాన్సులందుకోలేదు.
బాలీవుడ్ లోనే హీరోయిన్ గా కొనసాగింది. మరి ఇప్పుడు 'కింగ్' చిత్రంలో అవకాశం పట్ల అమ్మడు ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియాలో ఓ సంచలనం అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ తారలే దిగొచ్చి తెలుగు సినిమాలు చేస్తున్నారు. అలియాభట్, దీపికా పదుకొణే లాంటి భామలు తెలుగులో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సక్సెస్ లతో పాన్ ఇండియాలో సంచలనమయ్యారు. ఈ నేపథ్యంలో కత్రినా కైఫ్ కూడా కంబ్యాక్ అవుతుందో చూడాలి.
