100వ చిత్రంతోనే కింగ్ సెంచరీ క్లబ్ లోనా!
తన తరం హీరోలైనా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్లు సెంచరీలు కొట్టేస్తుంటే? కింగ్ మాత్రం అందుకు చాలా దూరంలో ఉన్నారు.
By: Tupaki Desk | 9 May 2025 9:00 PM ISTకింగ్ నాగార్జున సెంచరీ ఏ డైరెక్టర్ తో కొడతారు? అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిబేట్. ఇప్పటికే 95కి పైగా చిత్రాల్లో ఎన్నో వైవిథ్యమైన పాత్రలు పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు రాసు కున్నారు. ఏఎన్నార్ నట వారసత్వాన్ని కొనసాగించి....తర్వాత తరం వారసుల్ని ఇండస్ట్రీ అందించారు. అయితే నాగార్జున ఇంకా వంద కోట్ల క్లబ్ లో వెనుకబడే ఉన్నారు. తన తరం హీరోలైనా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్లు సెంచరీలు కొట్టేస్తుంటే? కింగ్ మాత్రం అందుకు చాలా దూరంలో ఉన్నారు.
దీంతో కింగ్ సెంచరీ కూడా 100వ సినిమాతో సాధ్యమవ్వాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 100వ సినిమా పనులు నాగ్ మొదలుపెట్టారు. పక్కా బ్లాక్ బస్టర్ ఇచ్చే దర్శకుడు ఎవరా? అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భాషతో సంబంధం లేకుండా మేకర్స్ విషయంలో వేట కొన సాగిస్తున్నారు. తెలుగు మినహాయిస్తే ఆతర్వాత తమిళ దర్శకుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా కార్తీక్ అనే మరో కోలీవుడ్ మేకర్ పేరు తెరపైకి వస్తుంది. `ఆకాశం` అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రా కార్తీక్ పేరు వినిపిస్తుంది. ఆకాశం అనే చిత్రాన్ని తమిళ్ లో తెరకెక్కించారు. కానీ ఇది పెద్దగా ఆడలేదు. డైరెక్టర్ గా ఇతడు అంత ఫేమస్ కాదు. పెద్దగా సినిమాలు చేసిన ట్రాక్ రికార్డు కూడా లేదు. అయినా నాగ్ లిస్ట్ లో అతడి పేరు చేరడం ఆసక్తికరం. స్టోరీ నచ్చితే నాగార్జున దైర్యంగా ముందుకెళ్తారు.
కొత్త వాళ్లను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. ఈనేపథ్యంలో 100వ సినిమా విషయంలో కింగ్ అదే సింప్లిసిటీని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఇదే లిస్ట్ లో నవీన్, విక్రమ్. కె. కుమార్ పేర్లు కూడా ఉన్న సంగతి తెలిసిందే. మరి కింగ్ తో సెంచరీ కొట్టించే ఛాన్స్ అంతిమంగా ఎవరు అందుకుంటారో చూడాలి. ప్రస్తుతం నాగ్ కూలీ, కుభేర చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోన్న సంగతి తెలిసిందే.
