Begin typing your search above and press return to search.

కింగ్ సెంచ‌రీ 'రా' కార్తీక్ తో ఫైన‌ల్!

ఈ నేప‌థ్యంలో చాలా మంది ద‌ర్శ‌కుల పేర్లు తెరపైకి వ‌చ్చాయి. ఈ లిస్ట్ లో త‌మిళ దర్శ‌కుడు 'రా' కార్తిక్ కూడా వెలుగులోకి వ‌చ్చాడు.

By:  Tupaki Desk   |   14 Jun 2025 10:53 AM IST
కింగ్ సెంచ‌రీ రా కార్తీక్ తో ఫైన‌ల్!
X

కింగ్ నాగార్జున సెంచ‌రీ కొట్టేదెప్పుడా ? అని అక్కినేని అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి, బాల‌య్య సెంచ‌రీలు ఎప్పుడొ కొట్టేసారు. దీంతో సీనియ‌ర్ల‌లో వెనుక‌బ‌డి నాగార్జున‌...వెంక‌టేష్ మాత్ర‌మే. వెంకీకి ఇంకా స‌మ‌యం ప‌డుతుంది. కానీ నాగార్జున మాత్రం 100 చిత్రానికి చేరువ‌లో ఉండ‌టంతో ఆస‌క్తి రెట్టింపు అవుతుంది. ఈ నేప‌థ్యంలో ఆ ఛాన్స్ ఏ ద‌ర్శ‌కుడు అందుకుంటాడు? అన్న దానిపైనా స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది .

ఈ నేప‌థ్యంలో చాలా మంది ద‌ర్శ‌కుల పేర్లు తెరపైకి వ‌చ్చాయి. ఈ లిస్ట్ లో త‌మిళ దర్శ‌కుడు 'రా' కార్తిక్ కూడా వెలుగులోకి వ‌చ్చాడు. అయితే ద‌ర్శ‌కుడిగా అత‌డికి పెద్ద‌గా అనుభ‌వం లేక‌పోవ‌డం...కేవ‌లం ఒక్క సినిమా డైరెక్ట‌ర్ చేయ‌డం..అదీ ఆశించిన ఫ‌లితం లేక‌పోవడంతో? ఇత‌డికి నాగార్జున అవ‌కాశం ఇవ్వ‌డం క‌ష్ట‌మ‌నుకున్నారంతా. కానీ సంగ‌తేంటంటే కింగ్ రా కార్తిక్ నే త‌న 100వ సినిమా ద‌ర్శకుడిగా ఎంచుకున్న‌ట్లు కాంపౌండ్ వ‌ర్గాల నుంచి తెలుస్తోంది.

మిగ‌తా ద‌ర్శ‌కులంద‌రి క‌థ కంటే కార్తీక్ క‌థ మాత్ర‌మే నాగార్జున‌ను మెప్పించింద‌ని దీంతో ఆయ‌న ఫైన‌ల్ చేసిన‌ట్లు వినిపిస్తుంది. జూలైలో ఈ చిత్ర ప్రారంభోత్స‌వం ఉంటుందంటున్నారు. లాంచింగ్ కు మంచి మూహూర్తం తేదీ వెతికే ప‌నిలోనూ పురోహితులు ప‌డ్డ‌ట్లు స‌మాచారం. అయితే ఈసినిమా స్టోరీ లైన్ ఏంటి? అన్న‌ది ఇంకా లీక్ అవ్వ‌లేదు. ప్ర‌స్తుతం నాగార్జున న‌టించిన 'కూలీ', 'కుబేర' చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

ఈ రెండు భారీ యాక్ష‌న్ చిత్రాలే. రెండింటిలోనూ నాగ్ డిఫ‌రెంట్ రోల్స్ తో అల‌రించ‌నున్నారు. హిట్ అయితే నాగార్జున ఇమేజ్ రెట్టింపు అవుతుంది. ఇవ‌న్నీ ఆలోచించుకునే కార్తీక్ ను చూజ్ చేసుకున్నారు? అని గ‌ట్టిగా వినిపిస్తుంది. ఈ విష‌యాన్ని అక్కినేని వ‌ర్గాలు ధృవీక‌రించాల్సి ఉంది.