Begin typing your search above and press return to search.

నాగార్జున సర్‌ప్రైజ్‌.. కింగ్ వస్తున్నాడు

ఈ అనౌన్స్మెంట్ పోస్టర్లో ఒక సైకిల్ తో పాటు దాని మీద కత్తి కూడా ఉంది. ఇక బ్యాక్ గ్రౌండ్లో పూర్తిగా పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   28 Aug 2023 3:39 PM GMT
నాగార్జున సర్‌ప్రైజ్‌.. కింగ్ వస్తున్నాడు
X

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రయోగాలు చేయడంలో ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాడు అని చెప్పవచ్చు. అలాగే సంక్రాంతి లాంటి పండగ సీజన్లో కూడా మంచి ఫ్యామిలీ సినిమాలను అందించడంలో కూడా ముందుంటాడు. ఇక తన సినిమా కెరియర్ లోనే సోగ్గాడే చిన్నినాయన సినిమాతో సంక్రాంతికి బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న నాగర్జున అలాగే మరో సంక్రాంతికి బంగార్రాజు సినిమాతో కూడా డీసెంట్ హిట్ అయితే చూశాడు.


ఇక ఇప్పుడు జెట్ స్పీడ్ లో మరోసారి సంక్రాంతిని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. మొదట అనుకున్న ప్రాజెక్టు ప్రణాళికలు క్యాన్సిల్ కావడంతో మరో కథను లైన్లోకి తీసుకువచ్చాడు. ఇక నాగార్జున 99వ సినిమాగా తెరపైకి రాబోతున్న ఈ ప్రాజెక్టు గురించి చాలా రోజులుగా అనేక రకాల కథనాలు అయితే వినపడుతున్నాయి.

ఇక నాగార్జున పూర్తిస్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా 99వ సినిమాతో సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగర్జున కొత్త సినిమాను చేయబోతున్నాడు. అయితే రేపు నాగ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కు రంగం సిద్ధమైంది. ఇక కొద్ది సేపటి క్రితమే ఒక చిన్న అప్డేట్ కూడా ఇచ్చారు.

ఈ అనౌన్స్మెంట్ పోస్టర్లో ఒక సైకిల్ తో పాటు దాని మీద కత్తి కూడా ఉంది. ఇక బ్యాక్ గ్రౌండ్లో పూర్తిగా పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది. నాగర్జునకు విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి కూడా టైమ్ చాలా బాగా కలిసి వచ్చింది. కాబట్టి ఈ సంక్రాంతికి కూడా ఈ సినిమా అదే తరహాలో సక్సెస్ ఇచ్చే అవకాశం గా భావిస్తున్నాడు. ఇక ఈ పోస్టర్కు మంచి క్యాప్షన్ కూడా ఇచ్చారు.

కింగ్ వస్తున్నాడు అంటూ రేపు ఉదయం 10 గంటల 27 నిమిషాలకు మరొక అప్డేట్ గా ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఈ సినిమాకు 'నా సామిరంగా' అనే టైటిల్ను అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పూర్తిస్థాయిలో సంక్రాంతి వాతావరణానికి తగ్గట్టుగా నాగర్జున గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్టు అతనికి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.