Begin typing your search above and press return to search.

సూపర్ హిట్ డైరెక్టర్ తో చైతూ.. వ్వాటే కాంబో!

కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటారు.

By:  Tupaki Desk   |   22 March 2024 4:20 PM GMT
సూపర్ హిట్ డైరెక్టర్ తో చైతూ.. వ్వాటే కాంబో!
X

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని వారసుడు నాగ చైతన్య.. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటారు. ప్రస్తుతం చైతూ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

చివరగా నాగ చైతన్య నటించిన కస్టడీ చిత్రం డిజాస్టర్ అయింది. బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దాలో గెస్ట్ రోల్ లో నటించగా.. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ ఫ్లాప్ అయింది. అంతకుముందు చేసిన థ్యాంక్యూ కూడా నిరాశపరిచింది. బంగార్రాజు సినిమా కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ప్రస్తుతం చైతూ.. తండేల్ మూవీపై నమ్మకం పెట్టుకున్నారు. గట్టి హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు.

చేపల వేటకు వెళ్లి దారి తప్పి పాకిస్తాన్ అధికారులకు చిక్కిన ఉత్తరాంధ్రకు చెందిన కొందరు మత్స్యకారుల జీవితం ఆధారంగా చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఔట్ ఫుట్ అంతా పర్ఫెక్ట్ గా వస్తుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే చైతూ.. తాజాగా తన నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో సినిమా చేయనున్నారట.

విరూపాక్ష మూవీ ఎంత పెద్ద హిట్టైందో అందరికీ తెలిసిందే. సంయుక్త హీరోయిన్ గా కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. అయితే ఈ మూవీ తర్వాత కార్తీక్ కొత్త సినిమా ప్రకటించలేదు. విరూపాక్ష సినిమా సీక్వెల్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఆలోచనను పక్కన పెట్టేశారట. ఇటీవల చైతూకు స్టోరీ వినిపించారట

కార్తీక్ దండు చెప్పిన స్టోరీ విన్న నాగచైతన్య.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించనున్నారట. విరూపాక్ష మూవీకి పూర్తిగా భిన్నమైన కథతో నాగ చైతన్య మూవీ తీయనున్నారట కార్తీక్. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో సినిమా సాగనుందని టాక్ వస్తోంది. మొత్తానికి విరూపాక్షతో సూపర్ హిట్ కొట్టిన కార్తీక్.. చైతూ మూవీతో ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.