Begin typing your search above and press return to search.

నాగ చైతన్య.. ఓ క్రేజీ సీక్వెల్

నాగ చైతన్య లీడ్ రోల్ లో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూత

By:  Tupaki Desk   |   18 March 2024 4:57 AM GMT
నాగ చైతన్య.. ఓ క్రేజీ సీక్వెల్
X

నాగ చైతన్య లీడ్ రోల్ లో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూత. ఈ వెబ్ సిరీస్ కి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టాప్ ట్రెండింగ్ లో ఈ వెబ్ సిరీస్ ఇప్పటికి కొనసాగుతూ ఉంది. థాంక్యూ సినిమాతో చైతన్యకి సక్సెస్ ఇవ్వలేకపోయిన విక్రమ్ కుమార్ వెబ్ సిరీస్ తో సూపర్ హిట్ ఇచ్చాడని చెప్పచ్చు. జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో కథని తీసుకొని ప్రస్తుతం మీడియా ఎలా ఉంది. నిజాలు చెప్పాల్సిన విలేకరులే వాటిని ఎలా సమాధి చేస్తున్నారు అనేది కథాంశంతో దూత తెరకెక్కించారు.

ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ ని చాలా క్యూరియాసిటీగా తీసుకెళ్లారు. చెప్పాలనుకున్న పాయింట్ ని ఎక్కడ డీవియేషన్ లేకుండా స్ట్రైట్ గా చెప్పడంతో దూత వెబ్ సిరీస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా సీజన్ 2 కూడా స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారంట. నాగ చైతన్య కూడా ఈ దూత వెబ్ సిరీస్ కొనసాగింపుపై ఆసక్తికరంగా ఉన్నారు.

మార్చి 19న దూత సీజన్ 2పై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని నాగ చైతన్య క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ సీజన్ 2 కోసం కథని కంప్లీట్ గా మారుస్తున్నారా లేదంటే అదే కథకి కొనసాగింపు ఇస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇలాంటి కథలతో వెబ్ సిరీస్ లు రావడం వలన సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇచ్చినట్లు ఆవుతుందని సోషల్ మీడియాలో వినిపిస్తోన్న మాట.

ఇదిలా ఉంటే నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ లో తండేల్ మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఫిషర్ మెన్స్ లైఫ్ లో జరిగిన రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో ఈ కథని తెరపై ఆవిష్కరిస్తున్నారు. గీతా ఆర్ట్స్ ఈ మూవీ కథపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

నాగ చైతన్య కూడా చాలా రోజుల తర్వాత ఒక మాస్ అప్పీల్ ఉన్న పాత్రలో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టరైజేషన్ చేస్తున్నాడు. సాయి పల్లవి ఈ మూవీలో నాగ చైతన్యకి జోడీగా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా మూవీలోలో చాలా కీలకంగా ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. ఇద్దరి లవ్ స్టోరీ ఎమోషనల్ గా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని టాక్.