Begin typing your search above and press return to search.

దూత -2.. చైతూ ట్వీట్ తో కొత్త డౌట్లు!

ఓటీటీ ఆడియన్స్ ఈ వెబ్ సిరీస్ కు ఫిదా అయ్యామని, రిపీట్ మోడ్ లో చూశామని కూడా అప్పట్లో కామెంట్లు పెట్టారు.

By:  Tupaki Desk   |   7 April 2024 11:01 AM GMT
దూత -2.. చైతూ ట్వీట్ తో కొత్త డౌట్లు!
X

దూత.. గతేడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన ఈ సిరీస్.. అప్పట్లో ఎన్నో రికార్డులు సృష్టించింది. అనేక నెలల పాటు టాప్ ట్రెండింగ్ లోనే ఉంది. ఓటీటీ ఆడియన్స్ ఈ వెబ్ సిరీస్ కు ఫిదా అయ్యామని, రిపీట్ మోడ్ లో చూశామని కూడా అప్పట్లో కామెంట్లు పెట్టారు.

అయితే ఈ వెబ్ సిరీస్ సీక్వెల్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొన్న జరిగిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్ లో ఈ సిరీస్ సీక్వెల్ కోసం ప్రకటన వస్తుందని అంతా ఆశించారు. కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఆ తర్వాత నాగ చైతన్య మాత్రం దూత టీమ్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్రేజీ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో నెట్టింట రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. సీక్వెల్ పై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

"దూత సక్సెస్ కాల్! ఇది చాలా సంతృప్తికరంగా ఉంది! త్వరలో మరిన్నింటి కోసం ఎదురు చూస్తున్నాను" అంటూ చైతూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. "మరిన్ని" అని అంటే సీజన్-2 అని అర్థమా? లేకుంటే ఇంకా ఏమైనా ఉందా? సీజన్-1 కు మళ్లీ ఏమైనా యాడ్ చేస్తారా? అదనపు సొబగులు అద్దుతారా? అని అంతా మాట్లాడుకుంటున్నారు.

మొత్తానికి చైతూ ట్వీట్ తో మళ్లీ ఆయన అభిమానుల్లో.. దూత-2 అప్డేట్ కోసం ఆసక్తి పెరిగింది. దీంతో ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉందేమోనని వెతికేస్తున్నారు. అసలు అమెజాన్ ప్రైమ్ వీడియో దూత సీక్వెల్ తీయడానికి ఫిక్స్ అయిందో లేదో తెలియదు.. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వెబ్ సిరీస్ టాపిక్ మాత్రం ట్రెండింగ్ లో ఉంది.

డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ వెబ్ సీరీస్ లో చైతూ.. జర్నలిస్ట్ సాగర్ గా కనిపించి తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ అక్కినేని వారసుడు తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు మత్స్యకారుల నిజ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే చైతూ ఫ్యాన్స్ అటు దూత - 2 అప్డేట్.. ఇటు తండేల్ రిలీజ్ కోసం ఫుల్ వెయిట్ చేస్తున్నారు.