Begin typing your search above and press return to search.

తండేల్ లో ఆ సీన్.. థియేటర్ దద్దరిల్లేలా..

నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ తండేల్.

By:  Tupaki Desk   |   5 April 2024 8:30 AM GMT
తండేల్ లో ఆ సీన్.. థియేటర్ దద్దరిల్లేలా..
X

నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ తండేల్. రియలిస్టిక్ సంఘటనల స్పూర్తితో తెరకెక్కుతోన్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఈ సినిమాలో చైతూకి జోడీగా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా కావడంతో యూత్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

సాయి పల్లవి ఒక సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది అంటే కచ్చితంగా ఆ మూవీలో కంటెంట్ ఏదో బలంగా ఉంటుందనే అభిప్రాయం జనాల్లోకి వెళ్ళిపోయింది. దర్శక, నిర్మాతలు కూడా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి సాయి పల్లవి మాత్రమే సరిపోతుంది అని డిసైడ్ అయ్యి మరీ ఎంపిక చేసుకున్నారు. ఈ కారణంగా తండేల్ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. మూవీ ఫస్ట్ గ్లింప్స్ ని అద్భుతమైన విజువల్స్ తో ఆవిష్కరించి చందూ మొండేటి సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేశారు.

శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో సముద్రంపై వేటకి వెళ్లే మత్స్యకారుల జీవితంలో జరిగిన సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది రైటర్ ఈ కథని సిద్ధం చేశారు. సినిమాలో అదిరిపోయే లవ్ స్టోరీతో పాటు అంతకుమించి దేశభక్తి పెంచే సన్నివేశాలు ఉంటాయంట. అలాగే గూస్ బాంబ్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాలో ఉంటాయని టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా ఈ సినిమాలో వర్షం ఫైట్ సీక్వెన్స్ ఉందంట. ఈ సీక్వెన్స్ లో నాగ చైతన్య ఇప్పటి వరకు ఎవరూ చూడనటువంటి ఒక మాస్ లుక్ లో కనిపిస్తాడంట. ఆ ఫైట్ సీక్వెన్స్ లో ఒక్కడు కూడా కుర్చీలో రిలాక్స్ గా కూర్చొని ఉండరని థియేటర్స్ దద్దరిల్లడం పక్కా అనే లీక్స్ వస్తున్నాయి చైతన్య మాస్ అప్పీల్ ని ఎంజాయ్ చేస్తూ పేపర్స్ పట్టుకొని గాల్లోకి విసరడానికి సిద్ధంగా ఉంటారని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

నెవ్వర్ బిఫోర్ అవతార్ లో ఈ ఫైట్ లో చైతూ ఫెరోషియస్ గా కనిపిస్తాడని అంటున్నారు. కంప్లీట్ శ్రీకాకుళం స్లాంగ్ లోనే నాగ చైతన్య, సాయి పల్లవి డైలాగ్స్ ఈ సినిమాలో ఉంటాయంట. అచ్చమైన ఉత్తరాంధ్ర నేటివిటీని, అక్కడి సముద్రపు అందాలని చందూ మొండేటి సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ లో ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే అదే టైమ్ లో దేవర మూవీ రిలీజ్ అవుతోంది. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు.