Begin typing your search above and press return to search.

తండేల్.. మొదట్లోనే రెస్పాన్స్ దద్దరిల్లింది

అక్కినేని యువ హీరో నాగ చైతన్య లీడ్ రోల్ లో సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీ తండేల్

By:  Tupaki Desk   |   8 Jan 2024 6:11 PM GMT
తండేల్.. మొదట్లోనే రెస్పాన్స్ దద్దరిల్లింది
X

అక్కినేని యువ హీరో నాగ చైతన్య లీడ్ రోల్ లో సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీ తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్, బన్నీ వాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్య మూవీకి గతంలో ఎప్పుడు లేనంత బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా బ్రాండ్ తో యూనివర్శల్ అప్పీల్ ఉన్న కంటెంట్ తో తండేల్ మూవీ తెరకెక్కుతోంది.

తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ని ఎసెన్స్ ఆఫ్ తండేల్ పేరుతో రిలీజ్ చేశారు. ఇక క్రిటిక్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ప్రతీ సీన్ అద్భుతంగా ఉందని అంటూ నాగచైతన్య లుక్ అలాగే సాయి పల్లవి రోల్ సూపర్బ్ అని పొగుడుతున్నారు. గతంలో నాగచైతన్య ఎప్పుడూ లేనంత మాస్ క్యారెక్టర్ తో మెప్పించబోతున్నాడు. నిజజీవితంలో సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

ఆ టీజర్ వివరాల్లోకి వెళితే.. డైరెక్ట్ గా లాంగ్ షాట్ లో సముద్రం మీద ఓపెన్ చేసి అందులో ఉన్న నాటు బోటు మీదకి తీసుకొని వెళ్లారు. అక్కడ చేపలకి వల వేస్తూ దద్దా గుర్తెట్టుకో… ఈ పాలి ఏటా గురితప్పేదే లేదేస్ అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్ తో కంటెంట్ లో ఇంటెన్షన్ ని రిప్రజెంట్ చేస్తూ అద్భుతమైన విజువల్ తో కాన్సెప్ట్ ని కూడా రివీల్ చేశాడు.

తరువాత కరాచీలో జైలు గోడల మధ్యలో బందీలుగా ఉన్న జాలర్లని రివీల్ చేసి జాతీయ జెండాని రిప్రజెంట్ చేస్తూ మా నుండి ఊడిపోయిన ఒక ముక్క… మీకే అంతుంటే… ఆ ముక్కని ముష్టి ఎసి మాకెంతుండాలి. భారత్ మాతాకీ జై అంటూ చెప్పే జైలాగ్ తో కంటెంట్ లో జాతీయవాదాన్ని బలంగా చెప్పినట్లు గ్లింప్స్ లో కనిపిస్తోంది.

విజువల్ చివర్లో తీరంలో సముద్రం నుంచి వచ్చే కెరటాలలు పాదాలని తాకుతూ ఉంటే హీరోయిన్ సాయి పల్లవి క్యారెక్టర్ బుజ్జితల్లిని రివీల్ చేశాడు. గ్లింప్స్ లో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు విజువలైజేషన్ కానీ, కంటెంట్ ప్రెజెంటేషన్ తో చందూ మొండేటి సరికొత్త కథని చెప్పబోతున్న హిట్ ఇచ్చాడు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కూడా ఫ్రెష్ ఫీల్ తో మ్యూజిక్ అందించాడు. దీంతో ఈ గ్లింప్స్ కి ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. విమర్శకుల ప్రశంసలు సైతం సొంతం చేసుకుంది. కచ్చితంగా నాగ చైతన్య కెరియర్ లో బ్లాక్ బస్టర్ బొమ్మగా తండేల్ మారే అవకాశం ఉందని ఈ గ్లింప్స్ చూస్తున్న వారి నుంచి వినిపిస్తోన్న మాట.