Begin typing your search above and press return to search.

చైతూ.. సూర్యుడిని అలా చూస్తూ..

తాజాగా ఇన్ స్టాలో స్పెషల్ ఫోటోను షేర్ చేశారు నాగ చైతన్య. అందులో సన్ సెట్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2024 5:55 AM GMT
చైతూ.. సూర్యుడిని అలా చూస్తూ..
X

అక్కినేని ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు యంగ్ హీరో నాగ చైతన్య. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం చైతూ.. తండేల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కార్తికేయ-2తో పాన్ ఇండియా రేంజ్‍ లో హిట్ కొట్టిన చందూ మొండేటి గ్రాండ్ గా, నేచురల్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే పలు కీలక షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న తండేల్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దసరా కానుకగా అక్టోబర్ లో ఈ మూవీ రిలీజ్ అవుతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే రిలీజ్ డేట్ ప్లాన్ ను మేకర్స్ మార్చుకున్నారని ఇటీవల టాక్ వినిపించింది. క్రిస్మస్ వీక్ లో డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది.

యధార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుండడంతో తండేల్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. రాజు అనే శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రను నాగ చైతన్య పోషిస్తున్నారు. అందుకోసం ఉత్తరాంధ్ర యాసను కూడా నేర్చుకున్నారు. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, షూటింగ్ పిక్స్ లో రగ్డ్ లుక్ లో కనిపించారు చైతూ. లాంగ్ హెయిర్, ఫుల్ గెడ్డంతో ఉన్నారు.

తాజాగా ఇన్ స్టాలో స్పెషల్ ఫోటోను షేర్ చేశారు నాగ చైతన్య. అందులో సన్ సెట్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. వైట్ టీ షర్ట్, గుబురు గడ్డం, వైట్ క్యాప్ పెట్టుకుని చైతూ ఉన్నారు. ప్రస్తుతం చైతూ పిక్ కు లైకుల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. పిక్ అదిరిపోయిందన్నా, తండేల్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. నెట్టింట చైతూ కూల్ ఫోటో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది.

ఇక తండేల్ మూవీలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. వర్కింగ్ స్టిల్స్ ను చూస్తుంటే.. సాయి పల్లవి తన రోల్ లో ఒదిగిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు, నాగ చైతన్య గత మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఈ మూవీతో భారీ హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నారు. మరి తండేల్ చిత్రం.. చైతూకు ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో తెలియాలంటే వేచి చూడాలి.