Begin typing your search above and press return to search.

మజిలీ కాంబో.. ఇది ఊహించని ట్విస్ట్?

శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   10 April 2024 11:30 AM GMT
మజిలీ కాంబో.. ఇది ఊహించని ట్విస్ట్?
X

నాగచైతన్య గత కొంతకాలంగా సెలెక్ట్ చేసుకుంటున్న కథలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. గతంలో మాదిరిగా వెంట వెంటనే సినిమాలు చేయకుండా కొంత గ్యాప్ కూడా తీసుకుంటున్నాడు. ప్రతీ స్టోరీ కూడా చాలా విభిన్నంగా ఉండాలి అని అతను ఆలోచిస్తున్న విధానం ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు.

శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు చందు ముందుగానే సినిమా కోసం వర్క్ షాప్ కూడా చేశాడు. పాకిస్తాన్ ఈస్ట్ కోస్ట్ గార్డులకు చిక్కిన శ్రీకాకుళం మత్స్యకారుల జీవితాలను చూపిస్తూ.. వారు అనుభవాలను ఎదుర్కొన్నారు అనే పాయింట్ తో దేశభక్తిని కూడా హైలెట్ చేయనున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య ఎవరితో వర్క్ చేస్తాడు అనే విషయంలో మాత్రం ఇంకా సరైన క్లారిటీ రాలేదు. ఇంతకుముందు అయితే లిస్టులో ఇద్దరు దర్శకులు పేర్లు ఉన్నప్పటికీ నాగ చైతన్య మాత్రం ముందుగా మాట అయితే ఇవ్వలేదట. కథల విషయంలో చర్చలు అయితే జరిగాయి. ఇక పరుశురామ్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నప్పటికీ అది ఊహించని విధంగా క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే.

అలాగే మరోసారి మజిలీ కాంబినేషన్ లో సినిమా చేయాలి అనుకున్న నాగచైతన్య సడన్ ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు శివా నిర్వాణతో ఇంతకుముందు నాగచైతన్య సమంతతో కలిసి మజిలీ అనే సినిమా చేశారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్ళి అదే దర్శకుడితో నాగచైతన్య సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.

నిజానికి ఖుషి తర్వాత ఈ దర్శకుడు నాగచైతన్యతో సినిమాను అనౌన్స్ కూడా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ మళ్ళీ వీరి కలయికకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. చేయాలనుకున్న కథ క్యాన్సిల్ అయినట్లు సమాచారం. ఈ విషయం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నాగచైతన్య ప్రస్తుతం పూర్తి స్థాయిలో తండేల్ ప్రాజెక్టు పైనే ఫోకస్ పెట్టాడు. ఇది పూర్తయిన తర్వాతనే మరో కథపై తిరిగి ఆలోచించుకోవాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే తండేల్ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పొందుతోంది. ఫ్యాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాబట్టి అతని మార్కెట్ రేంజ్ మరో లెవెల్ కు వెళ్ళాలి అంటే ఇదే ఒక బిగ్ ఛాన్స్. మరి ఈ సినిమాతో నాగచైతన్య ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.