Begin typing your search above and press return to search.

నాగ చైతన్య చందు.. మొదలయ్యేది అప్పుడే..!

నాగ చైతన్య మూవీని పాన్ ఇండియా రిలీజ్ చేసి నేషనల్ వైడ్ మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు చందు మొండేటి.

By:  Tupaki Desk   |   9 Sep 2023 5:48 AM GMT
నాగ చైతన్య చందు.. మొదలయ్యేది అప్పుడే..!
X

అక్కినేని హీరో నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమా చందు మొండేటితో డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా రాబోతుంది. ఈ సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మెన్ గా నటించబోతున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్, సాయి పల్లవి ఇద్దరు హీరోయిన్స్ నటించే అవకాశాలు ఉన్నాయని టాక్. నాగ చైతన్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఈ సినిమా అక్టోబర్ 20 నుంచి సెట్స్ మీదకు వెళ్తుందట. నెక్స్ట్ మంత్ నుంచి మొదటి షెడ్యూల్ నే లాంగ్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారట. ఈ షెడ్యూల్ లో సినిమా కాస్టింగ్ మొత్తం పాల్గొంటుందని అంటున్నారు. నాగ చైతన్య కెరీర్ లో సంథింగ్ స్పెషల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. స్క్రిప్ట్ దశలోనే ఈ సినిమాపై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు టాక్. కార్తికేయ 2 హిట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తన టాలెంట్ చూపించిన చందు మొండేటి మరోసారి ఈ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

ఈ సినిమా టెక్నికల్ టీం కూడా చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారట. అక్టోబర్ లో మొదలు పెట్టి 4 నెలలు టాకీ పార్ట్ మరో రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ ఇలా సినిమాను 6 నెలల్లో పూర్తి చేసి 2024 సమ్మర్ లో మంచి డేట్ కి ఈ సినిమా వదలాలని చూస్తున్నారు. హిట్లు ఫ్లాపుల మధ్య తన కెరీర్ కొనసాగిస్తున్న నాగ చైతన్య ఈ సినిమాతో భారీ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.

ఆల్రెడీ చందు మొండేటితో ప్రేమమ్ రీమేక్ హిట్ అందుకున్న నాగ చైతన్య ఆ తర్వాత సవ్యసాచి అనే అటెంప్ట్ చేసినా వర్క్ అవుట్ కాలేదు. హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ తో మాత్రం గురి తప్పకూడదని కష్టపడుతున్నారు చిత్ర యూనిట్. చైతు చందు ఈ కాంబో ఆడియన్స్ కు ఎలాంటి ట్రీట్ అందిస్తుందో చూడాలి.

ఈ సినిమా తర్వాత చందు కార్తికేయ 3 ప్లానింగ్ లో ఉన్నాడు. కోలీవుడ్ స్టార్ సూర్యతో కూడా చందు మొండేటి సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చందు మొండేటి తన పేరు ఉండేలా సినిమాల ప్లానింగ్ చేస్తున్నాడు. నాగ చైతన్య మూవీని పాన్ ఇండియా రిలీజ్ చేసి నేషనల్ వైడ్ మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు చందు మొండేటి.