Begin typing your search above and press return to search.

అమీర్ కూతురి పెళ్లి విందులో నాగ‌చైత‌న్య‌

లాల్ సింగ్ చ‌డ్డా కోస్టార్, త‌న గురువు అయిన అమీర్ ఖాన్ పై అభిమానం ఎలాంటిదో చై మ‌రోసారి ఈ పెళ్లి విందులో నిరూపించాడు.

By:  Tupaki Desk   |   14 Jan 2024 7:36 AM GMT
అమీర్ కూతురి పెళ్లి విందులో నాగ‌చైత‌న్య‌
X

ఇరా ఖాన్ - నుపుర్ శిఖరే జనవరి 3న ముంబైలో రిజిస్ట‌ర్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత, ఉదయపూర్‌లో కాథలిక్ వివాహ వేడుకలు క‌న్నుల పండుగగా సాగాయి. ఇప్పుడు అనంత‌ర వేడుకలు కొనసాగుతున్నాయి. అమీర్ పరిశ్రమలోని త‌మ‌ స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ ముంబైలో రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్ష‌న్ లో బాలీవుడ్ దిగ్గ‌జ స్టార్లు ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌గా టాలీవుడ్ నుంచి వెళ్లిన ఏకైక హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌. ఈ విందులో ఇరా - నూపూర్ జంట అంద‌రినీ ప‌ల‌క‌రిస్తూ ఆహ్లాదంగా క‌నిపించ‌గా, అమీర్, రీనా దత్తా, నూపూర్ తల్లి ప్రీతమ్ శిఖరే, ఇరా సోదరుడు జునైద్ ఖాన్‌లతో కలిసి పోజులిచ్చిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.


ఆస‌క్తిక‌రంగా ఇదే ఈవెంట్లో అక్కినేని నాగార్జున కుమారుడు, యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య ఎంతో స్టైలిష్ గా క‌నిపించాడు. లాల్ సింగ్ చ‌డ్డా కోస్టార్, త‌న గురువు అయిన అమీర్ ఖాన్ పై అభిమానం ఎలాంటిదో చై మ‌రోసారి ఈ పెళ్లి విందులో నిరూపించాడు. చైతూ సీనియ‌ర్ న‌టుడు అనీల్ క‌పూర్ తో క‌లిసి ఈ విందు కార్య‌క్ర‌మంలో దిగిన స్నాప్ ఒక్క‌టే ఇప్ప‌టికి అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది. అతడికి సంబంధించిన ఇత‌ర ఫోటోలేవీ ఇంకా రివీల్ కాలేదు. చైత‌న్య ఈ పెళ్లిలో తండేల్ లుక్ తో నే క‌నిపించాడు. బాగా ఎదిగిన జుత్తు, గుబురు గ‌డ్డంతో కొంత మాసీగా క‌నిపిస్తున్నా, సూట్ ధ‌రించి అత‌డు క్లాసీగా క‌నిపించాడు.

మాస్టర్ బ్లాసర్ సచిన్ టెండూల్కర్ కూడా రిసెప్షన్ లో క్లాస్‌గా కనిపించాడు. ఇక ఇదే వేదిక వ‌ద్ద దిగ్గ‌జ స్టార్లు క‌నిపించారు. నీలిరంగు దుస్తులలో అందంగా కనిపించిన జయా బచ్చన్.. త‌న‌ వెంట కూతురు శ్వేతా బచ్చన్ నందా, సోనాలి బింద్రే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఫర్హాన్ అక్తర్, షిబానీ దండేకర్ జంట నలుపు రంగు దుస్తుల్లో క‌నిపించ‌గా,జోయా అక్తర్‌తో వారు కలిసి పోజులిచ్చారు. డ్రీమ్ గ‌ర్ల్ హేమ మాలిని త‌న‌ కుమార్తె ఈషా డియోల్‌తో కనిపించారు. వారిద్దరూ అద్భుతంగా కనిపించారు. ఖయామత్ సే ఖయామత్ తక్ తో అమీర్ మొదటి సహనటి జూహీ చావ్లా భర్త జై మెహతాతో కలిసి కనిపించారు.

వివాహ రిసెప్షన్‌లో అమీర్, అతని మాజీ భార్య రీనా దత్తా, జునైద్ ఇతర కుటుంబ సభ్యులు నూతన వధూవరులతో కలిసి పోజులిచ్చారు. ఈవెంట్లో టాలీవుడ్ స్టార్ నాగ‌చైత‌న్య ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. చైతూ ప్ర‌స్తుతం చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తండేల్ అనే భారీ చిత్రంలో న‌టిస్తున్నాడు. స‌ముద్ర తీరం నేప‌థ్యంలోని ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో రూపొందుతున్న‌ ఈ మూవీ కోసం చై పూర్తి మేకోవ‌ర్ ని చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే.