Begin typing your search above and press return to search.

NC 23: చైతు కోసం రంగంలోకి టాలెంటెడ్ బ్యూటీ

అక్కినేని యువ హీరో నాగచైతన్య తన తదుపరి సినిమాను చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   19 Sep 2023 9:10 AM GMT
NC 23: చైతు కోసం రంగంలోకి టాలెంటెడ్ బ్యూటీ
X

అక్కినేని యువ హీరో నాగచైతన్య తన తదుపరి సినిమాను చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య 23వ సినిమాగా తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు మెల్లమెల్లగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే దర్శకుడు చందు నాగచైతన్యను నెవ్వర్ బిఫోర్ అనే పాత్రలో చూపించబోతున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య ఒక జాలరి పాత్రలో కనిపించబోతున్నాడు.

నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే దర్శకుడు చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. చాలా సార్లు వర్క్ షాప్ చేసిన తర్వాతనే సినిమాను పక్క ప్రణాళికతో మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి.

2018 లో గుజరాత్ నుంచి సముద్రతీరంలో వేటకు వెళ్లిన 21 మంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ లకు చిక్కిన విషయం తెలిసిందే. అందులో ఒకరైన రామారావు జీవిత ఆధారంగానే ఈ సినిమాను దర్శకుడు వెండి తెరపై కి తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి అక్కడ మత్స్యకారుల జీవన విధానాలు శైలి గురించి కూడా నాగచైతన్య దగ్గరుండి చూశాడు.

ఒక గ్రామంకు కూడా వెళ్లి అక్కడే వారి జీవిత విధానాన్ని కూడా దగ్గరుండి చూసారు. దర్శకుడు నాగచైతన్య నిర్మాత బన్నీ వాసు ఈ ప్రాజెక్టును పాన్ ఇండియా రేంజ్ లో తెరపైకి తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

మొన్నటి వరకు వివిధ రకాల పేర్లు పరిశీలనలో ఉండగా మొత్తానికి సాయి పల్లవి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసిన చిత్ర యూనిట్ సభ్యులు అందులో సాయి పల్లవి మొహం కనిపించకుండా చూపించారు. ఇక ఆ హావభావాలు చూస్తుంటే అందులో ఉన్నది సాయి పల్లవి అని అర్థమవుతుంది. తప్పకుండా వీరి కాంబినేషన్ హాట్ పిక్ అవుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే నాగచైతన్య సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమా మంచి సక్సెస్ గా నిలిచిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.