Begin typing your search above and press return to search.

ట‌బు అర్థ‌రాత్రి కూడా ఫోన్ చేస్తుంది!

ట‌బుతో మీ రిలేష‌న్ ఎలాంటిది? అప్ప‌ట్లో ప్రేమ‌లో ఉన్నారంటూ ప్ర‌చారం సాగింది క‌దా? అని మీడియా అధిప‌తి ప్ర‌శ్నించ‌గా, దానికి నాగార్జున త‌న‌దైన శైలిలో స్పందించారు.

By:  Tupaki Desk   |   11 March 2024 5:13 AM GMT
ట‌బు అర్థ‌రాత్రి కూడా ఫోన్ చేస్తుంది!
X

కింగ్ నాగార్జున‌.. అందాల‌ న‌టి ట‌బు మ‌ధ్య స్నేహం, ప్రేమాయ‌ణం గురించి టాలీవుడ్ లో చాలా గుస‌గుస‌లు వినిపించాయి. ఆ ఇద్ద‌రిపైనా పుకార్ల‌కు నాగార్జున వైఫ్ అమ‌ల అక్కినేని చిన్న‌బుచ్చుకునేవార‌ని కూడా చెబుతుంటారు. అయితే నాగ్ - ట‌బు బాండింగ్ గురించి ప్ర‌ముఖ మీడియా అధినేత చేసిన పాత ఇంట‌ర్వ్యూ ఇప్పుడు మరోసారి వైరల్ అవ్వుతుంది

ట‌బుతో మీ రిలేష‌న్ ఎలాంటిది? అప్ప‌ట్లో ప్రేమ‌లో ఉన్నారంటూ ప్ర‌చారం సాగింది క‌దా? అని మీడియా అధిప‌తి ప్ర‌శ్నించ‌గా, దానికి నాగార్జున త‌న‌దైన శైలిలో స్పందించారు. ట‌బు మంచి స్నేహితురాలు అని, ముంబై నుంచి ఎప్పుడు వ‌చ్చినా త‌మ ఇంట్లోనే ఉంటుంద‌ని నాగార్జున తెలిపారు.

త‌న భార్య‌ అమ‌ల అక్కినేని స్వ‌యంగా ట‌బు ఎంపిక చేసుకున్న ప్లేస్ లో త‌న‌ కోసం ఒక ఇంటిని కూడా నిర్మించేందుకు స‌హాయ‌స‌హ‌కారాలు అందించార‌ని వెల్ల‌డించారు.

త‌న‌కు మాత్ర‌మే కాదు, అమ‌ల‌కు త‌న కుటుంబీకుల‌కు ట‌బు ఎంతో స‌న్నిహితురాల‌ని తెలిపారు. ట‌బు హైద‌రాబాదీ.. చాలా కాలంగా స్నేహితురాలు. మా కుటుంబంలో క‌లిసిపోయింద‌ని కూడా నాగార్జున అన్నారు. తామిద్ద‌రం క‌లిసి న‌టించ‌డం వ‌ల్ల ఆ ప్ర‌చారం సాగింద‌ని తెలిపారు.

ఏదైనా క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు అర్థ‌రాత్రి అప‌రాత్రి అనే తేడా లేకుండా ట‌బు త‌న‌కే ముందుగా ఫోన్ చేస్తుంద‌ని కూడా నాగార్జున అన్నారు. మిడ్ నైట్ 2 గం.ట‌ల‌కు కూడా ఫోన్ చేసి ఏడ్చేస్తుంద‌ని, అప్పుడు అక్క‌డ ఎవ‌రైనా బోయ్ ఫ్రెండ్ తో స‌మ‌స్య ఎదురైందా? అని అడుగుతాన‌ని స‌ర‌దాగా అన్నారు. త‌న‌కు బోయ్ ఫ్రెండ్ తో ఇష్యూ వ‌చ్చినా తానే ప‌రిష్క‌రిస్తాన‌ని, త‌న‌ను మాత్ర‌మే అడుగుతుంద‌ని కూడా నాగ్ అన్నారు.

ఇక అనుష్క శెట్టితో ఎఫైర్ అంటూ పుకార్లు వ‌చ్చాయి క‌దా! అన‌గానే ఇది చాలా అన్యాయం అని నాగార్జున అన్నారు. అవ‌న్నీ పుకార్లు మాత్ర‌మేన‌ని ఖండించారు. 60 ప్ల‌స్ లోను న‌వ‌మ‌న్మ‌ధుడుగా వెలిగిపోతున్న నాగార్జున ఇప్ప‌టికీ వ‌ర‌స‌గా యాక్ష‌న్ చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.