Begin typing your search above and press return to search.

బాధపడి ఉంటే క్షమించండి: నాగబాబు

అయితే ఈ కామెంట్స్ తమ హీరోనే ఉద్దేశించి అన్నారంటూ ఓ వర్గం అభిమానులు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు.

By:  Tupaki Desk   |   29 Feb 2024 9:17 AM GMT
బాధపడి ఉంటే క్షమించండి: నాగబాబు
X

మెగా బ్రదర్ నాగబాబు రీసెంట్ గా ఆపరేషన్ వాలంటైన్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో 6.3 అడుగులు ఉన్నవారు చేస్తే బాగుంటుంది. 5.3 అడుగులు ఉన్న వ్యక్తి చేస్తే బాగుండదు అంటూ ఫ్లోలో చెప్పారు. అయితే ఈ కామెంట్స్ తమ హీరోనే ఉద్దేశించి అన్నారంటూ ఓ వర్గం అభిమానులు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. నాగబాబుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

కొంతమంది నేరుగా విమర్శలు చేశారు. దీనిపై వరుణ్ తేజ్ కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. నా హైత్ 6.3 అడుగులు కాబట్టి సందర్బోచితంగా 5.3 అడుగుల హాట్ అని మాట్లాడరని, ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయిన కూడా ఓ స్టార్ హీరో అభిమానులు మాత్రం ట్విట్టర్ లో మెగా బ్రదర్ నాగబాబుపై విమర్శలు చేయడం ఆపలేదు.

దీనికి కారణం ఒక సినిమాలో తమ హీరో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కొద్దిసేపు కనిపిస్తాడు. అందుకే అతన్ని ఉద్దేశించి అన్నాడంటూ అన్వయించుకున్నారు. తాజాగా దీనిపై ట్విట్టర్ ద్వారానే నాగబాబు క్షమాపణలు కోరుతూ లెటర్ విడుదల చేశారు. ఎవరైనా ఈ విషయంలో బాధపడి ఉంటే వారికి క్షమాపణ చెబుతున్నాను అంటూ నాగబాబు ఒక లేఖ విడుదల చేశారు.

వరుణ్ బాబు ఆపరేషన్ వాలంటైన్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పోలీస్ గా 6.3 అడుగులు ఉంటే బాగుంటుంది. 5.3 అడుగులు ఉంటే బాగుండదు అని చేసిన కామెంట్స్ చేశాను. ఆ మాటలని నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఎవరైన ఈ వ్యాఖ్యల కారణంగా బాధపడి ఉంటే క్షమించండి. ఆ వ్యాఖ్యలు యాదృశ్చికంగా వచ్చినవే కానీ కావాలని చేసినవి అయితే కాదు. అందరూ అర్ధం చేసుకొని క్షమిస్తారని ఆశిస్తున్నాను అంటూ లెటర్ లో పేర్కొన్నారు.

ఈ క్షమాపణలకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. మెగా హీరోలు ఇతర ఫ్యామిలీ హీరోల మధ్య ప్రస్తుతం మంచి రిలేషన్ ఉన్నారు. అయితే నాగబాబు వ్యాఖ్యలు ఓ వర్గం అభిమానులని నొప్పించడంతో ఆయన బహిరంగంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి క్షమాపణలు చెప్పడం విశేషం. దీనిపై నెటిజన్లు, తారక్ అభిమానుల నుంచి భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉండటం విశేషం. ఇక నాగబాబు ఈసారి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే.