Begin typing your search above and press return to search.

రాజమౌళిని దాటేసేలా కల్కి డైరెక్టర్ ప్లాన్..!

రాజమౌళి చూపించిన ఈ బాటలోనే నాగ్ అశ్విన్ కూడా వెళ్తున్నాడు. ప్రభాస్ లీడ్ రోల్ లో టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా కల్కి 2898 AD.

By:  Tupaki Desk   |   1 March 2024 2:30 AM GMT
రాజమౌళిని దాటేసేలా కల్కి డైరెక్టర్ ప్లాన్..!
X

తెలుగు సినిమాను ప్రపంచ స్థాయి సినిమాల పక్కన నిలబెట్టేందుకు రాజమౌళి చేసిన చేస్తున్న కృషి గురించి అందరికీ తెలిసిందే. బాహుబలితో పాన్ ఇండియాను.. ఆర్.ఆర్.ఆర్ తో పాన్ వరల్డ్ ఆడియన్స్ ని అలరించిన జక్కన్న నెక్స్ట్ మహేష్ సినిమాతో ఈసారి హాలీవుడ్ ని షేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. మహేష్ తో రాజమౌళి చేసే సినిమాపై వర్క్ షాప్ తోనే సినిమా రేంజ్ ఏంటో తెలిసేలా చేస్తున్నారు.

రాజమౌళి చూపించిన ఈ బాటలోనే నాగ్ అశ్విన్ కూడా వెళ్తున్నాడు. ప్రభాస్ లీడ్ రోల్ లో టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా కల్కి 2898 AD. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించారు. హాలీవుడ్ అప్పీల్ తో వస్తున్న కల్కి ఈ సినిమా తో రాజమౌళిని మించి పోయేలా ఉన్నాడు నాగ్ అశ్విన్. కల్కి సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నాడు.

సినిమా గురించి ఆడియన్స్ పై అంచనాలు పెంచేలా నాగ్ అశ్విన్ తన ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాడు. సినిమా గురించి హాలీవుడ్ లో కూడా క్రేజ్ ఏర్పడేలా చేయడంలో నాగ్ అశ్విన్ సూపర్ స్కెచ్ వేశాడని తెలుస్తుంది. మే 9న రిలీజ్ అవుతున్న కల్కి సినిమాపై ఇప్పటికే తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ నెల మొత్తం ఈ సినిమా కోసం భారీ ప్రమోషన్స్ చేస్తారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాకు హాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ మొదలు పెడతారని టాక్.

RRR రిలీజ్ తర్వాత హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వగా కల్కి సినిమాకు రిలీజ్ ముందే అక్కడ మీడియా కవరేజ్ ప్లాన్ చేస్తున్నారట. సో ఇదంతా చూస్తుంటే హాలీవుడ్ కి RRR తో రాజమౌళి పరిచయం ఏర్పడగా కల్కి తో నాగ్ అశ్విన్ అక్కడ డైరెక్టర్ గా తన ముద్ర వేసుకునేలా ఉన్నాడని అనిపిస్తుంది. కల్కి సినిమా విజువల్ వండర్ గా ఆడియన్స్ కు ఐ ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. మరి ఇంత భారీతనంతో వస్తున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

నాగ్ అశ్విన్ కల్కిని వైజయంతి మూవీస్ 500 కోట్ల పైన బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాను 9 భాగాలుగా తీసే ఆలోచనలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే కల్కి మరో ఇండియన్ మార్వెల్ సీరీస్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.