'ట్రోల్స్' తుఫానులో చిక్కుకున్న నాగవంశీ!
తీరా సినిమా రిజల్ట్ తేడా కొడితే ట్రోల్స్ వస్తుంటాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ డెబ్యూ మూవీ వార్-2 రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 19 Aug 2025 8:00 PM ISTటాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు తెరవెనుక తన బాబాయ్ రాధాకృష్ణ అలియాస్ చినబాబుకు సహాయం చేసిన ఆయన.. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ పై ఎన్నో మంచి సినిమాలు తీశారు.. తీస్తున్నారు కూడా.. అదే సమయంలో సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటారు.
ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ లో తనకు ఏది అనిపించినా నిర్మొహమాటంగా చెప్పేస్తారు. దీంతో ఆయన ఎప్పటికప్పుడు ట్రోలింగ్ గురవుతుంటారు. ముఖ్యంగా ఆయన ప్రమోషన్స్ టైమ్ లో సినిమాలకు సంబంధించి అనేక విషయాలను షేర్ చేసుకుంటూ.. సినిమాపై విపరీతమైన హైప్ పెంచుతుంటారు.
తీరా సినిమా రిజల్ట్ తేడా కొడితే ట్రోల్స్ వస్తుంటాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ డెబ్యూ మూవీ వార్-2 రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను నాగవంశీ సొంతం చేసుకున్నారు. రూ.80 కోట్లకుపైగా వెచ్చించారని ఇండస్ట్రీలో టాక్.
అయితే సినిమా విషయంలో ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశారు నాగవంశీ. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ లో భారీ బజ్ నెలకొనేలా వ్యాఖ్యానించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా హిట్ కాకపోతే తిట్టవచ్చని కూడా అన్నారు. కానీ వార్-2 రిలీజ్ అయ్యాక నాగవంశీ సృష్టించిన హైప్ అంతా ఒక్కసారిగా రివర్స్ అయింది.
మొదటి షో నుంచే సినిమా మిక్స్ డ్ టాక్ అందుకుంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కు అంతగా మెప్పించలేదు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా పూర్తయ్యేలా కనిపించడం లేదు. దీంతో నాగవంశీపై ఫుల్ ట్రోల్స్ వస్తున్నాయి. అలా అన్నారు.. ఇలా అన్నారు.. ఇప్పుడు సినిమా వచ్చాక ఏదో లేదని ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.
మొత్తానికి టాలీవుడ్ కు అత్యంత ఆశాజనకంగా ఉన్న యువ నిర్మాతల్లో ఒకరైన నాగ వంశీ, ఇప్పుడు ట్రోల్స్ తుఫానులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు.
