Begin typing your search above and press return to search.

హీరోల క్యారెక్టర్.. నాగవంశీ రిచ్ లాజిక్!

తమిళ స్టార్ సూర్య హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదలకు సిద్ధమవుతోంది.

By:  M Prashanth   |   11 Aug 2026 11:35 AM IST
హీరోల క్యారెక్టర్.. నాగవంశీ రిచ్ లాజిక్!
X

తమిళ స్టార్ సూర్య హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదలకు సిద్ధమవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా నాగవంశీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.

ముఖ్యంగా ఈ మూవీలో సూర్య పాత్ర ఎలా ఉండబోతోందనే దానిపై ఆయన ఒక ఇంట్రెస్టింగ్ క్లారిటీ ఇచ్చారు. సూర్య క్యారెక్టరైజేషన్ గురించి ప్రేక్షకులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి నాగవంశీ గతంలో బ్లాక్ బస్టర్ అయిన గజిని సినిమాను ఉదాహరణగా తీసుకున్నారు. ఆ సినిమాలో సూర్య ఒకవైపు సంజయ్ రామస్వామి అనే స్టైలిష్ కోటీశ్వరుడిగా, మరోవైపు ఒంటి మీద పచ్చబొట్లతో గతాన్ని మర్చిపోయి పగ తీర్చుకునే ప్రయోగాత్మక పాత్రలో కనిపించారు.

ఈ రెండు విభిన్నమైన వేరియేషన్స్ లో ప్రేక్షకులకు ఏ పాత్ర చూడటం ఎక్కువ ఇష్టం అనేది ఆయన ముందు ప్రస్తావించారు. గజినిలో గుండుతో కష్టాలు పడే క్యారెక్టర్ కంటే, డబ్బున్న సంజయ్ రామస్వామి పాత్రే తనకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమని నాగవంశీ ఎలాంటి మొహమాటం లేకుండా ఓపెన్ గా చెప్పారు. తన సినిమాలో హీరో ఎప్పుడూ చాలా రిచ్ గా, డబ్బున్న వాడిలా ఎంతో స్టైలిష్ గా కనిపించాలనేదే తన కోరిక అని స్పష్టం చేశారు.

ప్రయోగాలు చేస్తూ కష్టాలు పడే పాత్రలు తనకు అంతగా రుచించవని ఆయన తన లాజిక్ ను చాలా క్లియర్ గా తెలియజేశారు. దీని వెనుక ఉన్న లాజిక్ ను కూడా ఆయన నేటి జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా చాలా ప్రాక్టికల్ గా వివరించారు. సాధారణంగా ప్రతి ఒక్కరి నిజ జీవితంలో ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి. మనం పడే కష్టాలే హీరో కూడా స్క్రీన్ మీద పడుతుంటే అది చూసేవాళ్లకు ఒక ఎంటర్టైన్మెంట్ లా కాకుండా ట్రాజెడీలా అనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆడియన్స్ థియేటర్ కు వచ్చేది కేవలం రెండు గంటలు తమ బాధలను మర్చిపోవడానికే అని వివరించారు. మనం రియల్ లైఫ్ లో చేయలేని పనులను లేదా చేరుకోలేని స్థాయిని స్క్రీన్ మీద హీరో అనుభవిస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తామని, అక్కడే ప్రేక్షకులకు అసలైన సంతోషం దొరుకుతుందని నాగవంశీ తన ఆలోచనా విధానాన్ని పంచుకున్నారు. అందుకే తన బ్యానర్ లో వచ్చే హీరోలు ఎప్పుడూ ఆ రిచ్ లుక్ లోనే ఉండాలని తాను కోరుకుంటానని చెప్పారు. ఈ పాయింట్ తో ఆయన సినిమాల ఎంపిక ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

సరిగ్గా ఇదే కాన్సెప్ట్ తో తానూ డైరెక్టర్ వెంకీ అట్లూరి కలిసి విశ్వనాథ్ అండ్ సన్స్ లో సూర్య క్యారెక్టర్ ను పక్కాగా డిజైన్ చేసినట్లు ఆయన వెల్లడించారు. గజినిలోని సంజయ్ రామస్వామి తరహాలో ఒక అల్ట్రా రిచ్, స్టైలిష్ సూర్యను ఈ సినిమాలో చూడబోతున్నామని ఆయన కన్ఫర్మ్ చేశారు. ఈ లెక్కన సినిమాలో సూర్య వింటేజ్ క్లాస్ లుక్ హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది.