Begin typing your search above and press return to search.

జ్యోతిక లాంటి అదృష్టం అందరికీ దక్కదు: నాగవంశీ

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ మళ్ళీ సినిమాల స్పీడ్ పెంచారు.

By:  M Prashanth   |   12 Aug 2026 10:16 AM IST
జ్యోతిక లాంటి అదృష్టం అందరికీ దక్కదు: నాగవంశీ
X

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ మళ్ళీ సినిమాల స్పీడ్ పెంచారు. అలాగే సక్సెస్ ట్రాక్ లో కొనసాగేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో గానీ, ఈవెంట్స్ లో గానీ ఆయన మాట్లాడే మాటలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఇక లేటెస్ట్ జరిగిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ ఈవెంట్ లో కూడా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఈవెంట్ కు హీరో సూర్యతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వేడుకలో యాంకర్ సుమ.. "ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే డబ్బు ముఖ్యమా లేక వాళ్ళతో గడిపే సమయం ముఖ్యమా?" అని అడిగిన ప్రశ్నకు నాగవంశీ తనదైన శైలిలో ఫన్నీగా సమాధానమిచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఫ్యామిలీకి టైమ్ ఇవ్వడం చాలా కష్టమని, డబ్బులైనా ఇస్తాం కానీ టైమ్ ఇవ్వలేమని ఆయన చెప్పడం హైలెట్ అయ్యింది.

అయితే సుమ వెంటనే పక్కనే ఉన్న సూర్యను చూపిస్తూ.. ఆయన తన భార్యకు ఎంత టైమ్ ఇస్తున్నారో చూడండి అని కౌంటర్ వేశారు. దానికి నాగవంశీ స్పందిస్తూ సూర్య, జ్యోతికల జంట గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సూర్య లాంటి కేరింగ్ హస్బెండ్ దొరకాలని ఇండియాలో ఉన్న అమ్మాయిలందరూ కోరుకుంటారని, కానీ అలాంటి అదృష్టం జ్యోతిక గారికి మాత్రమే దక్కిందని ఆయన అన్నారు.

సూర్య, జ్యోతికల మధ్య ఉన్న అన్యోన్యతను, వాళ్ళ బంధాన్ని ఉద్దేశించి నాగవంశీ చేసిన ఈ కామెంట్స్ అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్నాయి. సూర్య తన ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, ముఖ్యంగా జ్యోతిక పట్ల ఆయన చూపించే ప్రేమ గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. నాగవంశీ ఆ విషయాన్నే సరదాగా ప్రస్తావించడం ఈవెంట్ కే హైలైట్ గా నిలిచింది. నాగవంశీ ఎప్పుడూ తన సినిమాల గురించి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంటారు. 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈవెంట్ లో కూడా ఆయన మూవీ సక్సెస్ మీద అంతే నమ్మకంతో కనిపించారు. ఆయన మాటలు, పంచుకున్న ఫన్నీ ఇన్సిడెంట్స్ ఈవెంట్ కు వచ్చిన ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి.

ప్రస్తుతం నాగవంశీ చేసిన ఈ కామెంట్స్ కి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సూర్య ఫ్యాన్స్ ఈ వీడియోలను తెగ షేర్ చేస్తూ తమ హీరో కేరింగ్ నేచర్ గురించి కామెంట్స్ పెడుతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తె ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్ లో ఉండనుందని ట్రైలర్ ద్వారా ఓ క్లారిటీ వచ్చేసింది. దర్శకుడు వెంకీ అట్లూరి కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఇదివరకే సితార బ్యానర్ కు వెంకీ సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో మంచి లాభాలను అందించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.