బుక్ మైషోలో రేటింగ్స్.. అసలు గుట్టు విప్పిన నిర్మాత
బుక్ మైషోలో కనిపించే రేటింగ్స్, లైక్స్ కూడా తాము డబ్బులు ఇచ్చే చేయిస్తున్నామని రివీల్ చేశారు నాగవంశీ.
By: Tupaki Desk | 22 July 2025 8:27 AM ISTటాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. ఇంటర్వ్యూల్లో నిజాయతీగా మాట్లాడుతారన్న విషయం తెలిసిందే. ఏం చెప్పాలనుకుంటారో.. బల్ల గుద్దినట్లు అచ్చం చెప్పేస్తారు. పలు వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు తాను నిర్మించిన కొత్త మూవీ కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి.
ఆ సమయంలో ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో కనిపించే రేటింగ్స్, లైక్స్ తో పాటు రివ్యూస్.. ట్విట్టర్ హైప్ అన్నీ ఫేక్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు ఇచ్చి తాము చేయిపిస్తామని అన్నారు. కొత్తగా రిలీజ్ అయ్యే సినిమా సమయంలో నిర్మాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో కూడా వివరించారు.
బుక్ మైషోలో కనిపించే రేటింగ్స్, లైక్స్ కూడా తాము డబ్బులు ఇచ్చే చేయిస్తున్నామని రివీల్ చేశారు నాగవంశీ. బుక్ మైషోలో ఒక సినిమాకు ఎక్కువ లైకులు ఉంటే మరో మూవీ నిర్మాత ఇలా డబ్బులు ఇచ్చి చేయించడమేనని అన్నారు. ఇదే నిజమని, ఇలాంటి తప్పుడు ప్రమోషన్ చేయకూడదని గిల్డ్ లో ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
అందుకే ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నానని, దయచేసి ట్విట్టర్ తోపాటు బుక్ మైషో హైప్ ను నమ్మవద్దని అన్నారు. అవన్నీ ఫేక్ అని, వాటిని నమ్మడం కంటే థియేటర్ కు వచ్చి సినిమా చూసి మీరే తీర్పు చెప్పాలని నాగవంశీ తెలిపారు. ఇటీవల నిర్మాత దిల్ రాజు.. యూట్యూబ్ వ్యూస్, లైక్స్ కోసం నిర్మాతలు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తున్నారని చెప్పిన విషయం తెలిసిందే.
కాగా, కింగ్డమ్ విషయానికొస్తే.. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా.. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా యాక్ట్ చేశారు. టాలెంటెడ్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. పీరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి రూపొందించారు.
శ్రీకర స్డూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మించారు. యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. జూలై 31వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా.. మేకర్స్ ఇప్పుడు ఫుల్ జోష్ లో మూవీని ప్రమోట్ చేస్తున్నారు.
