మల్టీప్లెక్స్ లో పాప్ కార్న్ కాస్ట్.. నాగవంశీ షాక్ అయ్యేలా..
మల్టీప్లెక్సుల్లో సినిమాలు చూడాలని అంతా అనుకుంటారు. కానీ అక్కడి ధరలకు మాత్రం చాలా మంది భయపడుతుంటారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
By: Tupaki Desk | 20 July 2025 12:59 PM ISTమల్టీప్లెక్సుల్లో సినిమాలు చూడాలని అంతా అనుకుంటారు. కానీ అక్కడి ధరలకు మాత్రం చాలా మంది భయపడుతుంటారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆహార పానీయాల ధరలు సామాన్యులు భరించలేనంతగా ఉంటున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి మల్టీప్లెక్స్ కు వెళ్లే తడిసి మోపెడు అవుతుందని.. కొందరు సింగిల్ స్క్రీన్స్ కు వెళ్తున్నారు.
ఇంకొందరు ఓటీటీలకు పరిమితమవుతున్నారు. అది మాత్రం నిజం. అయితే ఇప్పుడు టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. తెగ ట్రెండ్ అవుతున్నాయి. నాగవంశీ షాకయ్యేలా ధరలు ఉన్నాయిగా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?
మల్టీప్లెక్స్ లలో పాప్‌కార్న్ ధర సామాన్యుడే కాదని, తాను కూడా మోయలేనని తెలిపారు. రీసెంట్ గా ఓ సినిమాకు వెళ్తే రెండు పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ కొనుగోలు చేస్తే రూ.1200 అయిందని చెప్పారు. తాను మాత్రం ఏం చేయగలనని పేర్కొన్నారు. థియేటర్స్ లో తినుబండారాల రేట్లను క్రమబద్ధీకరించాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరాలనుకుంటున్నామని అన్నారు.
ఎందుకంటే కొన్ని మల్టీప్లెక్సుల నిర్వాహకులకు తామైతే చెప్పగలమని చెప్పారు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ చైన్‌లను నిర్వహిస్తున్న వారు సాధ్యం కాదని అంటారని తెలిపారు. అందుకే అవి తాము చెబితే అయ్యే పనులు కావని పేర్కొన్నారు. కాబట్టి ఆ విషయంపై ప్రభుత్వాలు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని నాగవంశీ అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో నాగ వంశీ కామెంట్స్ వైరల్ అవ్వగా.. నెటిజన్లు ఫుల్ గా రెస్పాండ్ అవుతున్నారు. మల్టీప్లెక్సుల్లో తినుబండారాల రేట్లను ఒక నిర్మాత స్వయంగా అంగీకరించినప్పుడు, సమస్య తీవ్రతను చెప్పనవసరం లేదని అంటున్నారు. ఇప్పటికైనా స్పందించి తగ్గించాలని చెబుతున్నారు. అనేక పోస్టులు కూడా పెడుతున్నారు.
అదే సమయంలో అంతకుముందు ఆయన చేసిన కామెంట్స్ ను వైరల్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం దేవర సినిమా రిలీజ్ టైమ్ లో టికెట్ రేట్ 250 రూపాయలే కదా అంటూ నాగవంశీ మాట్లాడారు. ఫ్యామిలీ అంతా వచ్చి చూస్తే 1000 రూపాయలని, పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ కు ఇంకో 500 వేసుకున్నా 1500 అవుతుందని అన్నారు. ఇప్పుడు పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ కు 1200 అయిందని అన్నారు.
