Begin typing your search above and press return to search.

నాగవంశీ రీ ఎంట్రీ.. ఇచ్చిపడేశాడుగా..

అయితే ఈ ట్రోల్స్, ఫేక్ నేరేటివ్స్ మధ్య నాగ వంశీ మౌనంగా ఉన్నాడు. ఆ మౌనం మరింత ఊహాగానాలకు తావిచ్చింది.

By:  M Prashanth   |   20 Aug 2025 5:12 PM IST
నాగవంశీ రీ ఎంట్రీ.. ఇచ్చిపడేశాడుగా..
X

టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల వార్ 2 సినిమాతో భారీ రిస్క్ తీసుకున్న ఆయన, సినిమా ఫలితం ఊహించని విధంగా రావడంతో ట్రోల్స్ తుఫానులో చిక్కుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా, మీమ్స్ వరుసగా వచ్చాయి. వార్ 2 తెలుగు హక్కులకు 80 కోట్లకు పైగా వెచ్చించాడన్న టాక్ రావడంతో నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్స్ వచ్చాయి. సినిమా ఫలితం అంచనాలు అందుకోకపోవడంతో, "నాగ వంశీ ఇక దుబాయ్‌కి పారిపోతాడు" అనే రూమర్స్ కూడా సృష్టించారు.

అయితే ఈ ట్రోల్స్, ఫేక్ నేరేటివ్స్ మధ్య నాగ వంశీ మౌనంగా ఉన్నాడు. ఆ మౌనం మరింత ఊహాగానాలకు తావిచ్చింది. నిజంగా ఆయన సినిమాల నుండి పక్కకు తప్పుకున్నారా? లేక మరో షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే ఇవన్నీ ఊహాగానాలేనని, వాస్తవం కాదని చివరకు నాగ వంశీ తనే క్లారిటీ ఇచ్చాడు.

సోషల్ మీడియాలో తిరిగి ఎంట్రీ ఇస్తూ ఆయన ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. "ఎంటి నన్ను మిస్ అవుతున్నట్టున్నారుగా... వంశీ ఇది, వంశీ అది అంటూ ఫుల్ నేరేటివ్స్ నడుస్తున్నాయి. సరే, X లో మంచి రైటర్స్ ఉన్నారు. కానీ నిరాశపరచాల్సి వస్తుంది. ఇంకా ఆ టైమ్ రాలేదు. మినిమమ్ ఇంకో 10-15 ఏళ్లు ఉంది. ఎల్లప్పుడూ సినిమాకే, సినిమాకోసమే!" అంటూ రాసుకొచ్చారు.

ఇక తన రాబోయే ప్రాజెక్ట్ గురించి కూడా హింట్ ఇచ్చాడు. "#MassJathara very soon" అని చెబుతూ మాస్ జాతర అనే సినిమా కోసం సిద్ధమవుతున్నట్టు స్పష్టంచేశారు. ఈ ప్రకటనతోనే ఆయన ఎక్కడికీ పోవలేదని, మిగతా రూమర్స్ అన్నీ వాస్తవం కాదని తేలిపోయింది. దీంతో రూమర్స్ కి ఇచ్చి పడేశాడు అని మరికొందరు ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

ఇక వంశీ, వార్ 2లో నష్టాల గురించి కూడా టాక్ వస్తూనే ఉంది. ఆయన యశ్ రాజ్ ఫిలిమ్స్ వద్ద నుండి 22 కోట్ల రిఫండ్ కోసం డిమాండ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సినిమా అంచనాలు అందుకోకపోవడంతో వచ్చిన ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించుకోవడమే దీనికి కారణమని అంటున్నారు.

మొత్తానికి ట్రోల్స్ తుఫానులో చిక్కుకున్న నాగ వంశీ, ఇప్పుడు ఊర మాస్ రేంజ్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు. మాస్ జాతర సినిమాతో తిరిగి ట్రాక్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. సోషల్ మీడియాలో రీ ఎంట్రీ, పాజిటివ్ వైబ్స్ ఇచ్చింది. ఇక మాస్ జాతర ఏ రేంజ్‌లో ఉంటుందో, ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.