మ్యూజిక్ డైరెక్టర్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నాగవంశీ!
స్టేజ్ ఎక్కితే చాలు తనదైన అగ్రెసివ్ స్పీచ్‌లతో సోషల్ మీడియాను షేక్ చేయడం నిర్మాత నాగవంశీకి వెన్నతో పెట్టిన విద్య.
By: Madhu Reddy | 3 Aug 2026 12:32 PM ISTస్టేజ్ ఎక్కితే చాలు తనదైన అగ్రెసివ్ స్పీచ్‌లతో సోషల్ మీడియాను షేక్ చేయడం నిర్మాత నాగవంశీకి వెన్నతో పెట్టిన విద్య. టాలీవుడ్‌లోనే కాకుండా ఇప్పుడు తమిళనాడు వెళ్లినా ఆయన తన మార్క్ అస్సలు మార్చుకోలేదు. తమిళ స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో వస్తున్న 'విశ్వనాథన్ అండ్ సన్స్' సినిమా చెన్నై ఈవెంట్‌లో నాగవంశీ మాట్లాడిన తీరు, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్‌కు ఇచ్చిన సరదా ‘వార్నింగ్’ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది..
నిర్మాత అంటే ఆ మాత్రం అగ్రెసివ్‌గా ఉండాలి:
స్టేజీపై నిర్మాతలు వీర లెవెల్లో స్పీచ్‌లు ఇవ్వడం, అవి క్షణాల్లో వైరల్ అవ్వడం నాగవంశీతోనే మొదలైందేమో అనిపిస్తుంది. మిగిలిన మేకర్స్ కూడా ఆయనను చూసే ఈ అగ్రెసివ్ స్టైల్ నేర్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ ప్రాజెక్ట్‌గా వస్తున్న ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ కోసం చెన్నైలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో నాగవంశీ తన మార్క్ స్పీచ్‌తో దుమ్మురేపారు.
జి.వి. ప్రకాష్‌కి ఫన్నీ వార్నింగ్:
ఈ ఈవెంట్‌లో నాగవంశీ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్‌ను ఉద్దేశించి ఫన్నీగా బెదిరించారు. "సూర్య ఫ్యాన్స్ కోసం నువ్వు బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ ఇచ్చి తీరాలి.. లేకపోతే సూర్య ఫ్యాన్స్ నిన్ను మర్డర్ చేస్తారు" అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు. ఈ డైలాగ్ అక్కడ ఉన్న వారందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించడమే కాకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
'అల వైకుంఠపురములో' రేంజ్ హిట్ కొడుతుంది:
తెలుగులో అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో, తమిళంలో సూర్యతో తీసిన ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ కూడా అదే స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందని సూర్య ఫ్యాన్స్‌కు నాగవంశీ మాటిచ్చారు. అలాగే ప్రస్తుత జెన్-జీ తరానికి మమితా బైజు నటన బాగా నచ్చుతుందని, సూర్య, మమిత, రాధికల మధ్య వచ్చే సీన్లు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయని చెప్పారు.
ఆగస్టు 14న అసలైన పరీక్ష:
‘లక్కీ భాస్కర్’ లాంటి వరుస సక్సెస్ లతో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక రవీనా టాండన్, మమితా బైజు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతోంది. మరి నాగవంశీ చెప్పినట్లే ఈ సినిమా తమిళనాట ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో చూడాలి.
వంశీ మార్క్ ప్రమోషన్ రచ్చ:
ఏది ఏమైనా నాగవంశీ స్పీచ్‌లు సినిమాకు ఇచ్చే హైప్ అంతా ఇంతా కాదు. సరదా వార్నింగ్‌లతో, ధీటైన స్టేట్‌మెంట్‌లతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసిన ఈ యంగ్ ప్రోడ్యూసర్, ఆగస్టు 14న మరో బిగ్గెస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే..
