తారక్ అలా చెప్పడం ఎంతో ఆనందాన్నిచ్చింది
నాగ చైతన్య తన తర్వాతి సినిమాను విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 April 2025 4:00 PM ISTగత కొన్ని సినిమాలుగా సక్సెస్ లేక ఎంతో ఇబ్బంది పడిన నాగ చైతన్య ఈ ఏడాది తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా చైతన్య కెరీర్ లోనే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం చైతన్య తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.
నాగ చైతన్య తన తర్వాతి సినిమాను విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం చైతన్య కెరీర్లో 24వ మూవీగా తెరకెక్కుతుంది. భారీ వీఎఫ్ఎక్స్ తో ఈ సినిమా రూపొందుతుందని చైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తెలిపాడు. అయితే అదే ఇంటర్వ్యూలో నాగచైతన్య తన ఫుడ్ బిజినెస్ గురించి కూడా మాట్లాడాడు.
చైతన్య గత కొన్నాళ్లుగా ఫుడ్ బిజినెస్ లో రాణిస్తున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల కిందటే చైతూ హైదరాబాద్‌లో షోయు అనే రెస్టారెంట్‌ను స్టార్ట్ చేసి అందులో రుచికరమైన వంటకాలను ప్రజలకు రుచి చూపిస్తున్నాడు. రీసెంట్ గా దేవర జపాన్ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్, నాగచైతన్య నడుపుతున్న షోయు గురించి మాట్లాడి, దాని గురించి మంచి రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే.
దేవర జపాన్ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ఉన్న ఫేవరెట్ రెస్టారెంట్స్ ను జపనీస్ కోసం చెప్పమని ఎన్టీఆర్ ను యాంకర్ అడగ్గా, దానికి ఎన్టీఆర్ హైదరాబాద్ ఫుడ్ కల్చర్ చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంటర్నేషనల్ ఫుడ్ దొరుకుతుందని అది బాంబే, ఢిల్లీ, హైదరాబాదేనని చెప్పిన తారక్, హైదరాబాద్ లో జపనీస్ ఫుడ్ దొరికే ప్లేస్ ఒకటుందని, అది తన తోటి నటుడైన నాగ చైతన్యదేనని, అందులో సుషీ చాలా బావుంటుందని షోయు గురించి నెక్ట్స్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చాడు తారక్.
ఎన్టీఆర్ తన రెస్టారెంట్ గురించి మాట్లాడి, అక్కడ ఫుడ్ బావుంటుందని చెప్పిన వీడియో చూసిన రోజు తనకెంతో ఆనందంగా అనిపించిందని చైతన్య ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. షోయు అనే రెస్టారెంట్ పెట్టాలనే ఆలోచన తనకు లాక్‌డౌన్ టైమ్ లో వచ్చిందని, ఆ ఆలోచనతోనే తన రెస్టారెంట్ మొదలైందని, ప్రెజెంట్ తన హోటల్ చాలా బాగా రన్ అవుతుందని నాగ చైతన్య తెలిపాడు.
